హుజూర్‌నగర్ కళాశాలలకు మహర్దశ
ABN, Publish Date - Dec 19 , 2024 | 12:32 AM
హుజూర్‌నగర్ పట్టణంలో విద్యారంగానికి మహర్దశ కలగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషి ఫలితంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. జీప్లస్-1 మోడల్‌లో రెండు కళాశాలల భవనాలను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో 234 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు కొత్త భవనాలు
రూ.11.90 కోట్లు నిధులు మంజూరు
హుజూర్‌నగర్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): హుజూర్‌నగర్ పట్టణంలో విద్యారంగానికి మహర్దశ కలగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషి ఫలితంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. జీప్లస్-1 మోడల్‌లో రెండు కళాశాలల భవనాలను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో 234 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. డిగ్రీ కళాశాలకు రూ.4.65 కోట్లు, జూనియర్ కళాశాలకు రూ.7.25 కోట్ల నిధులు కేటాయించారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ఈ రెండు కళాశాలల్లో అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో పట్టణానికి డిగ్రీ కళాశాలను మంజూరుచేయించి రూ.3కోట్లతో పక్కా భవనం కూడా నిర్మించారు. దానికి అదనంగా ఇప్పుడు రూ.4.65కోట్లు మంజూరు చేయించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉత్తమ్ డిగ్రీ కళాశాల మంజూరుచేయించి భవనాన్ని నిర్మించగా, మళ్లీ పదేళ్ల తర్వాత మరో పక్కా భవనాన్ని నిర్మించడం విశేషం. ఇటీవలే రూ.కోటితో విద్యార్థులకు కంప్యూటర్లను మంత్రి ఉత్తమ్ మంజూరు చేయించారు. దీనికితోడు కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
Updated Date - Dec 19 , 2024 | 12:32 AM