ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

ABN, Publish Date - Dec 29 , 2024 | 01:01 AM

జీవో నంబర్‌ 51 ని సవరించి అందరినీ పర్మినెంట్‌ చేస్తూ మల్టీపర్పస్‌ విధానాన్ని ఎత్తివేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఫైళ్ల గణపతిరెడ్డి అన్నారు.

రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఫైళ్ల గణపతిరెడ్డి

భువనగిరి (కలెక్టరేట్‌), డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జీవో నంబర్‌ 51 ని సవరించి అందరినీ పర్మినెంట్‌ చేస్తూ మల్టీపర్పస్‌ విధానాన్ని ఎత్తివేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఫైళ్ల గణపతిరెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సేవలను గుర్తించి అందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట వారు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పంచాయితీ కార్మికుల రాష్ట్ర మహిళా కన్వీనర్‌ పొట్ట యాదమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో అత్యంత ప్రధానమైన పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, హరితహారం నిర్వహణ లాంటి విషయాల్లో పంచాయతీ కార్మికులు ప్రఽధాన భూమిక పోషిస్తారని, అందరినీ పర్మినెంట్‌ చేయాలని కోరారు. చాలీ చాలని వేతనంతో పని చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్రామ పంచాయితీ సిబ్బందిని 2వ పీఆర్‌సీ పరిధిలోకి తీసుకవచ్చి కేటగిరిల వారిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కారోబారు, బిల్‌ కలెక్టర్‌ లను సహాయ కార్యదర్శులుగా ప్రమోషన్లను ఇవ్వాలన్నారు. కార్మికులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి ఈఎ్‌సఐ, పీఎ్‌ఫతో రిటైర్మెంట్‌ బెనఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, పంచాయతీ కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని గ్రామ పంచాయితీలలో పని చేస్తున్న కార్మికులు ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 01:01 AM