యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రణాళికలు
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:00 AM
యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని, అం దుకే అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యో తి): యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని, అం దుకే అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారన్నారు. మృతురాలు రేవతి విషయంలో సీపీ ఆనంద్ చెప్పిన విషయాలను సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడాని తప్పుబట్టి అవమానించిన అల్లు అర్జున్ బేషరత్‌గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవతి మృతికి కారణమైన ఆయన మాటాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పోలీసులను దుర్భాషటాడటం ఏంట ని, ట్విట్టర్ టిల్లు, అగ్గిపెట్టె లంబూ అల్లు అర్జున్‌కు వత్తాస్ పలకడమేంటని ప్రశ్నించారు. రేవతి కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సహకారం అందించానని, ఆమె కుమారుడిని బతికించాలని వైద్యులను కోరామని, వై ద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తోందన్నా రు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా డబ్బు మదం తో అంబేడ్కర్‌పై అనుచితంగా మాట్లాడారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో గంధమల్ల పూర్తిచేసి ఆలేరుతో పాటు ఇతర నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఒకటిన్నర టీఎంసీలతో నిర్మాణం చేస్తే లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయని గంధమల్ల రిజర్వాయర్ పనులు ఫిబ్రవరిలో ప్రారంభిస్తామన్నారు. యా దగిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉన్నాయని, త్వరలో వాటిని ప్రారంభిస్తామన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై పార్లమెంట్‌లో చర్చించడం లేదని, ఇండియా కూటమి ధర్నా చే యకుండా అడ్డుకుందని, బీజేపీకి జమిలి ఎన్నికలపై తప్ప పార్లమెంట్‌లో ఏ విషయంపై చర్చ జరగడం ఇష్టంలేదన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మా ట్లాడుతూ, ఏడు రోజులుగా 38గంటలపాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనాయకుడు అ సెంబ్లీకి రాకపోగా, ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ఇప్పటి వరకు ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులను నింపి సస్యశ్యామలం చేస్తామన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మా ట్లాడుతూ, అంబేడ్కర్‌ను అమానించిన అమిత్‌షా కచ్చితంగా దేశ ప్రజలకు, దళితజాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ అంబులెన్స్ వా హనాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించా రు. కార్యక్రమాల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యరెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుఽధ, పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజ్‌గౌడ్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కౌ న్సిలర్లు ముక్కెర్ల మల్లేశ్‌యాదవ్, గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్, నాయకులు బందారపు భిక్షపతిగౌడ్, ఎరుకల హేమేందర్‌గౌడ్, శంకర్‌నాయక్, దుంబాల వెంకట్‌రెడ్డి, శిఖ ఉపేందర్‌గౌడ్, సత్యప్రకా్‌షగౌడ్ పాల్గొన్నారు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం గుట్టలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుస్థిర విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ల ఆగమనంతో దేశంలో ఇప్పటికే సగం పల్లెటూళ్లు పల్లెదనం కోల్పోయాయన్నారు. తమ ప్రజా ప్రభుత్వం రైత న్న బతుకు బాగు చేయాలని 25లక్షల మందికి రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేసిందని, ఉచిత విద్యుత్ పథకాన్ని ఇచ్చి అండగా ఉందన్నారు. ప్రభుత్వం సంక్రాంతికి రైతు భరోసా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. 10 రాష్ట్రాల్లో సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసిన 115మంది రైతు జంటలకు పుడమిపుత్ర అవార్డులు, 35మంది అధికారులు, శాస్త్రవేతలు, జర్నలిస్టులకు కిసాన్‌సేవా అవార్డులు అందజేశారు. అనంతరం విద్యార్థుల సైన్స్‌ఫెయిర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామలకిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఆలేరు, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్లు చైతన్యరెడ్డి, అవేస్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, పడమటి పావని, మెరుగు మధు, మాటూరి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 01:00 AM