ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వినతులు తీసుకుని.. బాధితులకు భరోసానిచ్చి

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:19 AM

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో ప్రజల నుం చి కలెక్టర్‌ హనుమంతరావు అర్జీలు తీసుకొని వారి సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చారు.

భువనగిరి (కలెక్టరేట్‌), డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో ప్రజల నుం చి కలెక్టర్‌ హనుమంతరావు అర్జీలు తీసుకొని వారి సమస్యలు విని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి మొత్తం 55 అర్జీలు రాగా, వాటిలో అధికంగా రెవెన్యూశాఖకు చెందినవి 36, పంచాయతీరాజ్‌ ఆరు, గృహ నిర్మాణశాఖ ఐదు, సంక్షేమశాఖలు మూడు, మున్సిపాలిటీలు రెండు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌వి రెండు, ఫుడ్‌ సేఫ్టీకి చెందిన ఒక ఫిర్యాదు అందింది. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, గంగాధర్‌, జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, పాల్గొన్నారు.

మోత్కూరును రెవెన్యూ డివిజన్‌ చేయాలి

(ఆంధ్రజ్యోతి, మోత్కూరు): మోత్కూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరుతూ బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి నాయకులు కలెక్టర్‌ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. మోత్కూరు మండలం నుంచి భువనగిరి రెవెన్యూ డివిజన్‌ కేంద్రం 42 కిలోమీటర్ల దూరంలో ఉందని, అడ్డగూడూరు మండలం భువనగిరికి 70కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు కలెక్టర్‌కు వివరించారు. మోత్కూరును రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌, కలిమెల నర్సయ్య, జయప్రకాశ్‌, తదితరులు ఉన్నారు.

మెనూ పాటించకపోతే కఠిన చర్యలు

(ఆంధ్రజ్యోతి, భువనగిరి టౌన్‌): పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం పట్టణ పరిధిలోని రాయిగిరి జడ్పీహెచ్‌ఎస్‌ను ఆయన తనిఖీ చేసి వంట నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనానికి సరిపడా పప్పు, కూరగాయలు లేకపోవడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. వంటగది అపరిశుభ్రంగా ఉండటం, ఎలుకలు తిరుగుతుండడం, భోజనం నాణ్యతగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయురాలు ఆండాలు, ఫుడ్‌ కమిటీ సభ్యులైన ఉపాధ్యాయులు ఎండి.అలీ, షరీఫ్‌, ఎం.విజయకు డీఈవో కె.సత్యనారాయణ షోకాజు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు రాకపోవడంతో ఏజెన్సీలు మెనూ పాటించడం లేదని ఉపాధ్యాయులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బిల్లుల మంజూరుకు ప్రయత్నిస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Dec 24 , 2024 | 12:19 AM