ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలి

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:09 AM

సీఎం కప్‌ రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లాకు బహుమతి తీసుకరావాలని అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, గ్రంథాలయ చైర్మన్‌ అవేస్‌ చిస్తీ సూచించారు. సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. గురుకుల ఆశ్రమ పాఠశాలలో విజేతలకు మెడల్స్‌, షీల్డ్‌, ప్రశాంసపత్రాలను అందజేశారు.

అదనపు కలెక్టర్‌ గంగాధర్‌, గ్రంథాలయ చైర్మన్‌ అవేస్‌ చిస్తీ

భువనగిరి గంజ్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం కప్‌ రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లాకు బహుమతి తీసుకరావాలని అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, గ్రంథాలయ చైర్మన్‌ అవేస్‌ చిస్తీ సూచించారు. సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. గురుకుల ఆశ్రమ పాఠశాలలో విజేతలకు మెడల్స్‌, షీల్డ్‌, ప్రశాంసపత్రాలను అందజేశారు. వారు మాట్లాడుతూ క్రమశిక్షణ అంకితభావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. ఓడినవారు కుంగి పోకుండా మరోసారి క్రీడల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల ఆశయాలు నేరవేర్చాలన్నారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్‌లో ఉపాఽఽధిలో రిజర్వేషన్లు పొందవచ్చన్నారు. జిల్లాలో ఈ నెల 16 నుంచి 21వరకు సీఎం కప్‌ క్రీడా పోటీలు కబడ్డీ, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, బేస్‌బాల్‌, ఖోఖో, రెజ్లింగ్‌, సైక్లింగ్‌, చెస్‌, యోగా, నెట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, స్టాండింగ్‌తోపాటు పలు క్రీడలు నిర్వహించామని, రాష్ట్రస్థాయిలో పాల్గొనే జిల్లా జట్టు ప్రాబబుల్స్‌ ఎంపిక చేసినట్లు జిల్లా యువజన శాఖ అధికారి కె.ధనంజనేయులు తెలిపారు. ముగింపు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమారు ఆరు రోజులుగా 3000కుపైగా క్రీడాకారులు హాజరైనట్లు పేర్కొన్నారు. అయితే విజేతలుగా కబడ్డీ ప్రథమ బహుమతి బీబీనగర్‌ (బాలురు), బొమ్మలరమారం (బాలికలు), ద్వితీయ బహుమతి భువనగిరి(బాలురు), తుర్కపల్లి (బాలికలు), వాలీబాల్‌ ప్రథమ బహుమతి తుర్కపల్లి (బాలురు), మోటకొండూరు (బాలికలు), ద్వితీయ బహుమతి మోటకొండూరు (బాలురు), ఆలేరు (బాలికలు), ఖోఖో ప్రథమ బహుమతి భువనగిరి (బాలికలు), యాదగిరిగుట్ట (బాలురు), దిత్వీయ బహుమతి వలిగొండ (బాలికలు), బొమ్మలరామారం (బాలురు)గా గెలుపొందారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, భువనగిరి మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజుల్‌రెడ్డి, అధికారులు శ్రీనివాస్‌, బాలకృష్ణ, కరణ్‌, కృష్ణమూర్తి, రమే్‌షరెడ్డి, గోపాల్‌లతో పాటు పీడీలు, పీఈటీలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:09 AM