ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆశించిన అభివృద్ధి జరగలేదు

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:12 AM

జిల్లాలో ఆశించినస్థాయిలో అభివృద్ధి జరగలేదని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం

చౌటుప్పల్‌ టౌన్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆశించినస్థాయిలో అభివృద్ధి జరగలేదని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న ఈ జిల్లా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. సాగునీటి సమస్యతో వ్యవసాయ రంగం వెనకబడిందని, జిల్లాలో అనేక చేతివృత్తులకు చెందిన ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఈ జిల్లాకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, పోరాటాల జిల్లాగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్లీనరీలో చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్లీనరీ సమావేశాల్లో జిల్లా నూతన కమిటీ ఎంపిక ఉంటుందని, రాష్ట్ర ప్లీనరీలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీలో టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్‌రెడ్డి, టీజేఎస్‌ నాయకులు మారం లక్ష్మారెడ్డి, పన్నాల గోపాల్‌ రెడ్డి, గంగసాని శ్రీనివా్‌సరెడ్డి, ఎన్‌.భిక్షం, ఎన్‌.అశోక్‌, జి.ఆంజనేయచారి పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:13 AM