సోషలిస్టు దేశమే లక్ష్యంగా బలపడాలి
ABN, Publish Date - Dec 31 , 2024 | 12:30 AM
దేశాన్ని ఫాసిస్టు శక్తుల నుంచి కాపాడి, సోషలిస్టు దేశంగా కొనసాగించడమే లక్ష్యంగా సీపీఐ బలపడాల్సిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ ప్రఽధాన కార్యదర్శి డీ.రాజా పిలుపునిచ్చారు. సీపీఐ శతవార్షికోత్సవ సందర్భంగా సోమవారం నల్లగొండలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
పల్లెపల్లెకు పార్టీని విస్తరించాలి
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా
నల్లగొండ గడ్డకు లాల్‌సలామ్ : సురవరం సుధాకర్‌రెడ్డి
అట్టహాసంగా సీపీఐ శతవార్షిక బహిరంగసభ
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): దేశాన్ని ఫాసిస్టు శక్తుల నుంచి కాపాడి, సోషలిస్టు దేశంగా కొనసాగించడమే లక్ష్యంగా సీపీఐ బలపడాల్సిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ ప్రఽధాన కార్యదర్శి డీ.రాజా పిలుపునిచ్చారు. సీపీఐ శతవార్షికోత్సవ సందర్భంగా సోమవారం నల్లగొండలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయినా, రాజ్యాంగంలో అంబేడ్కర్ సూచించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఏర్పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికీ దళితులు, ఆదివాసీలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం రూపొందించిన మహానీయుడు అంబేడ్కర్‌నే అవమానిస్తూ కేంద్ర హోం మంత్రి మాట్లాడారని, ఆయన క్షమాపణలు చెప్పకపోతే రోడ్లపైన తిరగలేరని హెచ్చరించారు. సీపీఐ వందో వార్షికోత్సవం సందర్భంగా పార్టీ బలపడాల్సిన అవసరముందని, ప్రతీ పల్లెకు, ప్రతీ పట్టణానికి, నగరంలో మూలమూలలకు పార్టీ కార్యకర్తలు వెళ్లాలని, ప్రజా సమస్యలపై, ఇబ్బందులపై పోరాటాలు చేయాలని, పార్టీని విస్తృతపరచాలని సూచించారు. దేశం పలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సందర్భంలో కమ్యూనిస్టులు బలపడడం అవసరమని పేర్కొన్నారు.
మహనీయుల గడ్డ నుంచి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, సురవరం సుధాకర్‌రెడ్డి
రావినారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ధర్మభిక్షం, బీఎన్‌రెడ్డి వంటి మహానీయులు ప్రాతినిధ్యం వహించిన గడ్డ నుంచి తనను పార్లమెంటుకు రెండుసార్లు ఎన్నుకున్న నల్లగొం డ ప్రజలకు కృతజ్ఞతలని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యద ర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఫాసిజం, క్రోనీ క్యాపిటలిజం బలపడ్డ ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు అవసరమని, పార్టీని మూలమూలకు తీసుకెళ్లి ప్రజ ల కోసం పోరాడాలని, ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక నిజాం రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలని, వెట్టిచాకిరీ రద్దుచేయాలని, భూస్వామ్యవ్యవస్థ రద్దు చేయాలని సీపీఐ పోరాడిందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభిం చి దేశానికి స్ఫూర్తిగా నిలిచిన గడ్డ నల్లగొండ అని కొనియాడా రు. ఆ స్ఫూర్తితోనే తన ఆరోగ్యం సహకరించకపోయినా, ఈ సభకు వచ్చానని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన నల్లగొండ జిల్లాలోనే సీపీఐ శతవార్షికోత్సవ ప్రారంభ సభ నిర్వహిస్తున్నందుకు సంతోషపడుతున్నామని పేర్కొన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికోసం చేపట్టిన నాటి సాయుధ పోరాటంలో 4,500 మంది ఆశువులు బాసితే, అందులో 3వేలమంది వరకు నల్లగొండ బిడ్డలేనని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నానన్నారు. సాయుధపోరాటంలో వీరోచితంగా పోరాడిన దొడ్డికొమరయ్య, చాకలి అయిలమ్మ, షేక్‌బందగీ ఈ జిల్లా వారేనని పేర్కొన్నారు. సీపీఐ, ఆర్‌ఎ్‌సఎస్ ఒకే సంవత్సరంలో ఆవిర్భవించినా తమ పార్టీ నాడు స్వాతంత్రం కోసం, ఆతర్వాత దేశంలో పీడితవర్గాల కోసం, చట్టాల అమలు కోసం, ప్రజల కోసం పోరాడిందని, సమానత్వం కోసం ఉద్యమించామని, కానీ ఆర్‌ఎ్‌సఎస్ ఇలాంటి పోరాటాలేవీ చేయలేదన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ దేశంలో మతాల పరంగా విచ్ఛినపరుస్తోందని, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు. వందేళ్ల సందర్భంగా కమ్యూనిస్టు పార్టీని వాడవాడలా పునర్నిర్మించడానికి కార్యకర్తలంతా సన్నద్ధులవ్వాలని, పల్లెపల్లెకు, వాడవాడకు వెళ్లి పార్టీ భావాజాలమున్నవారిని కలుపుకొని శాఖల నిర్మాణాలు చేయాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై, ప్రజల ఈతి బాధలపైనా చైతన్యపరచడమే కాకుండా పోరాటాలు నిర్మించాలని ఈ ఏడాదంతా కష్టపడి పార్టీని బలపరచుదామని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మతతత్త్వశక్తులను నిరోధించడంలో కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో సాయుధపోరాటం మొదలు సాగునీటి వనరులకోసం, ఫ్లోరైడ్ సమస్యపైనా, కార్మిక, కర్షకుల సమస్యలపైనా సీపీఐ నిర్మాణాత్మక పోరు సల్పిందని వివరించారు. ఈ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, మాజీ ఎమ్మెల్యేలు చాడా వెంకటరెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, నల్లగొండ, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాల కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, బెజవాడ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 12:30 AM