ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోమాత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలి

ABN, Publish Date - Dec 25 , 2024 | 11:46 PM

గోమాత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి, చైతన్యవంతులను చేయాలని బాలకృష్ణగురుస్వామి పిలుపునిచ్చారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 18 రాష్ట్రాల మీదుగా సుమారు 7వేల కిలోమీటర్లు గోమాతతో చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర బుధవారం చౌటుప్పల్‌ పట్టణానికి చేరుకుంది.

బాలకృష్ణ గురు స్వామి

చౌటుప్పల్‌ టౌన్‌, డిసెంబరు 25 ( ఆంధ్రజ్యోతి): గోమాత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి, చైతన్యవంతులను చేయాలని బాలకృష్ణగురుస్వామి పిలుపునిచ్చారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 18 రాష్ట్రాల మీదుగా సుమారు 7వేల కిలోమీటర్లు గోమాతతో చేపట్టిన బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర బుధవారం చౌటుప్పల్‌ పట్టణానికి చేరుకుంది. గురుస్వామి పాదయాత్రకు అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, హిందూ సంఘాలు, అ య్యప్ప స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. మహిళ లు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భం గా బాలకృష్ణగురుస్వామి మాట్లాడుతూ దేశవాళీ గోవులు, ఎడ్లను కాపాడాలని, వ్యవసాయ రంగంలో గోఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యకరమైన ఆహార పంటలను పండించాలన్నారు. గో ఉత్పత్తుల వాడకంతో భూసారం పెరగడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునన్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, పేడలను పంచగవ్యాలుగా పరిగణిస్తారని, వీటి వినియోగంతో భయంకరమైన రోగాలు సైతం తగ్గిపోతాయని తెలిపారు. పరమ పవిత్రంగా పూజించే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గో సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిళ్ల మురళీ గురుస్వామి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుర్వి నర్సింహగౌడ్‌, పార్టీ పట్టణ ఇన్‌చార్జి మొగుదాల రమేష్‌, ముత్యాల భూపాల్‌ రెడ్డి, డి.భిక్షమాచారి, కౌన్సిలర్లు కామిశెట్టి శైలజ, బొడిగె బాలకృష్ణ, చెవగోని వెంకటేష్‌, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షుడు భాస్కర్‌, ఉపాధ్యక్షుడు శంకర్‌, ప్రధాన కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:47 PM