పెద్దగట్టు జాతరను ప్రణాళికతో నిర్వహించాలి
ABN, Publish Date - Dec 25 , 2024 | 12:49 AM
ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని పెద్దగట్టు జాతరను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ సనప్రీతసింగ్ అన్నారు.
చివ్వెంల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని పెద్దగట్టు జాతరను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ సనప్రీతసింగ్ అన్నారు. మంగళవారం దురాజ్‌పల్లి సమీపంలోని శ్రీలింగమంతులస్వామి ఆలయప్రాంగణాన్ని పరిశీలించి, మాట్లాడారు. జాతరకు సంబంధించి బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బందోబస్తు ప్రణాళికపై స్పెషల్ బ్రాంచ దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల న్నారు. అంతకుముందు ఆలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే స్థలాన్ని వాహనాల పార్కింగ్ ప్రవేశాల స్థితిగతులను పరిశీలించి, సూచనలు చేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ఆయన వెంట డీఎస్పీ రవి, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ ఇనస్పెక్టర్ నాగభూషణం, చివ్వెంల ఎస్‌ఐ మహేశ్వర్ పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 12:49 AM