ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసులు న్యాయం చేయాలి

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:15 AM

తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆటోడ్రైవర్‌ సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు.

పోలీసుల అదుపులో ఆటోడ్రైవర్‌ చింతల్‌

సెల్‌టవర్‌ ఎక్కి ఆటోడ్రైవర్‌ హల్‌చల్‌

కట్టంగూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆటోడ్రైవర్‌ సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల శివారులో రెండుగంటల పాటు సెల్‌టవర్‌పైనే ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన చిలుముల చింతల్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల నకిరేకల్‌లో ఆటో రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా చిం తల్‌ను నకిరేకల్‌కు చెందిన కొందరు చితకబాదారు. ఈ ఘటనపై నకిరేకల్‌ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదుచేసినా వారు పట్టించుకోలేదు. దీంతో న్యాయంచేయాలని కోరుతూ సోమవారం అయిటిపాముల శివారులోని ఓ సెల్‌టవర్‌ ఎక్కి రెండుగంటల పాటు హల్‌చల్‌ సృష్టించాడు. విషయం తెలుసుకున్న కట్టంగూరు ఎస్‌ఐ రవీందర్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లారు. ఫోనలో చింతల్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని ఎస్‌ఐ హామీఇవ్వడంతో చింతల్‌ కిందికి దిగి వచ్చాడు. అనంతరం పోలీసులు అతడిని నకిరేకల్‌ పోలీ్‌సస్టేషనకు తరలించారు.

Updated Date - Dec 24 , 2024 | 12:15 AM