Shanmukh Jaswanth: షణ్ముఖ్ కేసులో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే?
ABN , Publish Date - Feb 22 , 2024 | 10:26 PM
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswaanth), అతని సోదరుడు సంపత్ వినయ్ (Sampath Vinay) కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. గురువారం గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ ఈ ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. గంజాయి తాగినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో.. ఆ ఇద్దరిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు సోదరులు కలిసి గంజాయి సేవిస్తున్నట్టు విచారణలో తేలింది.
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswaanth), అతని సోదరుడు సంపత్ వినయ్ (Sampath Vinay) కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. గురువారం గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ ఈ ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. గంజాయి తాగినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో.. ఆ ఇద్దరిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు సోదరులు కలిసి గంజాయి సేవిస్తున్నట్టు కూడా విచారణలో తేలింది. తనని మోసం చేశాడంటూ సంపత్‌పై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో.. ఈ బండారం బయటపడింది. అదే సమయంలో షణ్ముఖ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. 16 గ్రాముల గంజాయి పట్టుబడింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు షణ్ముఖ్, సంపత్‌లను విచారిస్తున్నారు. ఈ గంజాయి ఎవరు సప్లై చేశారన్న కోణంలోనూ విచారిస్తున్నారు.
వాస్తవానికి.. వైజాగ్‌కి చెందిన ఓ యువతి (డాక్టర్) తొలుత సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. షణ్ముణ్ ద్వారా తనకు సంపత్ పరిచయం అయ్యాడని, అది క్రమంగా ప్రేమగా మారిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, చేతికి రింగ్ తొడిగి పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడని తెలిపింది. ఒకసారి గర్భం కూడా తీయించాడని చెప్పింది. అయితే.. ఇంతలో సంపత్‌కు మరో యువతితో పెళ్లి అయ్యిందని తెలిసి తాను మోసపోయానని గ్రహించానని, అందుకే ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, సంపత్‌ని పట్టుకోవడానికి ఇంటికి వెళ్లారు. అయితే.. అక్కడ షణ్ముఖ్‌తో పాటు సంపత్ గంజాయి సేవిస్తూ కనిపించడంతో ఇద్దరిని అరెస్టు చేశారు. షణ్ముఖ్, సంపత్‌లకు వైద్యు పరీక్షలు నిర్వహించగా.. గంజాయి సేవించినట్టు నిర్ధారణ అవ్వడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.