ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NIMS: పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

ABN, Publish Date - Oct 17 , 2024 | 04:16 AM

నిమ్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దశాబ్దకాలంలో 1,000 మందికి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనతను సాధించింది.

  • నిమ్స్‌ అరుదైన రికార్డు

  • ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 101 కిడ్నీల మార్పిడి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దశాబ్దకాలంలో 1,000 మందికి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనతను సాధించింది. కొవిడ్‌ తీవ్రత కారణంగా 2020 ఏడాదిని మినహాయించి.. వరుసగా పదేళ్లలో ఏటా 100కుపైగా కిడ్నీల మార్పిడి చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. 1989లో నిమ్స్‌లో కిడ్నీల మార్పిడి ప్రారంభించారు. అప్పటి నుంచి 2014 వరకు 730 మందికి కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా.. 2015 నుంచి 2024 వరకు వెయ్యి మందికి మూత్రపిండాల మార్పిడి చేశారు. జీవన్‌దాన్‌కెడవర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లలో వేగం గణనీయంగా పెరిగింది. 2015 ప్రారంభం నుంచి యూరాలజిస్టుల బృందం పిల్లలు, పెద్దలకు కలిపి వెయ్యి కిడ్నీల మార్పిడిని పూర్తి చేసింది.


ఈ ఏడాదిలో వైద్య బృందం ఇప్పటి వరకు 101 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను నిర్వహించింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వ్యయం అయ్యే శస్త్రచికిత్స పూర్తిగా ఉచితంగా అందించారు. తెలంగాణ ప్రభుత్వ నిధులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య పథకం కింద కూడా ఉచితంగా కిడ్నీ మార్పిడిలకు అవకాశం కల్పిస్తున్నారు. మూత్ర పిండాల మార్పిడిలే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు, ప్రొస్టేట్‌ సమస్యలు, క్యాన్సర్‌, పునర్నిర్మాణ యూరాలజీ, రోబోటిక్‌ పద్ధతులు, పీడియాట్రిక్‌ యూరాలజీకి సంబంధించిన శస్త్రచికిత్సలతో సహా ప్రతి నెలా 900 నుంచి 1000 ఇతర యూరాలాజికల్‌ వైద్య ప్రక్రియలను నిర్వహిస్తున్నారు.


ముఖ్యమైన శస్త్రచికిత్సలను నిర్వహిస్తూనే.. ఒకే రోజులో రెండు లేదా అంతకంటే ఎక్కువ కిడ్నీ మార్పిడిలను చేసినట్లు హెచ్‌వోడీడాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ తెలిపారు. ఈ మార్పిడిల్లో డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నేతృత్వంలో సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామ్‌ రెడ్డి, డాక్టర్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ రామచంద్రయ్య, డాక్టర్‌ రఘువీర్‌, డాక్టర్‌ చరణ్‌ కుమార్‌, డాక్టర్‌ ధీరజ్‌, డాక్టర్‌లతో కూడిన యూరాలజిస్టుల బృందం శస్త్రచికిత్సలు నిర్వహించింది. నెఫ్రాలజీ బృందంలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ గంగాధర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ భూషణ్‌ రాజు, ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్వర్ణలత కీలకంగా వ్యవహరించారు. నిమ్స్‌ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న యూరాలజీ యూనిట్లలో ఒకటిగా నిలిచిందని ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి తెలిపారు.

Updated Date - Oct 17 , 2024 | 04:16 AM