ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Electric shock: కొంచెంలో తప్పించుకున్న గ్రామస్థులు... లేకుంటే అంతే..

ABN, Publish Date - May 24 , 2024 | 01:46 PM

కామారెడ్డి, మే 24: సాధారణంగా విద్యుత్ షాక్‌(Electric shock)తో ఒకరిద్దరూ మృతిచెందుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుటాం... కానీ గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికీ విద్యుత్ షాక్ వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్(Kondapur) గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండాలో చోటు చేసుకుంది.

Kondapur villagers got electric shock

కామారెడ్డి, మే 24: సాధారణంగా విద్యుత్ షాక్‌(Electric shock)తో ఒకరిద్దరూ మృతిచెందుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుటాం... కానీ గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికీ విద్యుత్ షాక్ వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్(Kondapur) గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండాలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఒక్కసారిగా తండాలోని అన్ని నివాసపు ఇళ్లకు విద్యుదాఘాతం అవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ముగ్గురు తండావాసులు ప్రమాదానికి గురికాగా వారిని ఆస్పత్రికి తరలించారు.


విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, ఏదో ఒక ఇంటికి కాకుండా గ్రామంలోని ప్రతి ఇంటికీ విద్యుత్ షాక్ రావడం అధికారుల అలసత్వానికి నిదర్శమని గ్రామస్థులు అన్నారు. అధికారుల తీరుపై వారు మండిపడ్డారు. కొండాపూర్ సబ్ స్టేషన్ను ముట్టడించి నిరసన తెలిపారు. దేవుడి దయతో తామంతా ప్రాణాలతో బయటపడ్డామని, ఒకవేళ తాము మరణించి ఉంటే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని కొందరు... స్థానిక అధికారులను ప్రశ్నించారు. మరమ్మతులు త్వరగా చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లేనిపక్షంలో తమ ఆగ్రహం చవిచూస్తారని గ్రామస్థులు హెచ్చరించారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 24 , 2024 | 01:47 PM

Advertising
Advertising