ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవ

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:49 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో శుక్రవారం స్వామివారికి సువర్ణపుష్పార్చన, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం వైభవంగా కొనసాగాయి.

యాదగిరిగుట్ట ప్రధానాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలు

పూజల్లో పాల్గొన్న త్రిపుర రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌

భువనగిరి అర్బన్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో శుక్రవారం స్వామివారికి సువర్ణపుష్పార్చన, ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం వైభవంగా కొనసాగాయి. ఆగమశాస్త్ర రీతిలో వేడుకలు నిర్వహించిన అర్చకులు వేకువజామున సుప్రభాత సేవతో స్వయంభువులను మేల్కొలిపి పంచామృతాలు, వేదమంత్ర పఠనాలతో అభిషేకం, తులసీదళాలు, కుంకుమతో అర్చించారు. ప్రాకార మండపంలో హోమం, నిత్యకల్యాణం సంప్రదాయరీతిలో కొనసాగాయి. సాయంత్రం ప్రధానాలయలంలో కొలువుదీరిన ఆండాళ్‌ అమ్మవారిని పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి సేవలో తీర్చిదిద్దారు. అమ్మవారి సేవను ఆలయ తీరువీధుల్లో ఊరేగించిన అర్చకులు ప్రాకార మండపంలోని అద్దాల మండపం ఊయలలో అధిష్ఠింపజేశారు. అర్చకుల వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు, మహిళా భక్తుల మంగళ నీరాజనాల నడుమ ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. పాతగుట్ట ఆలయంలో నిత్యపూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. శివాలయంలో పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామి వారికి నిత్యపూజలు, యాగశాలలో చండీహోమం శైవాగమ పద్ధతిలో చేపట్టారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల నుంచి రూ.30,29,923 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు తెలిపారు. త్రిపుర రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దివ్య విమాన గోపురం బంగారు తాపడానికి రూ.50వేల చెక్కు అందజేశారు. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ఐదో రోజు శుక్రవారం వైభవంగా కొనసాగాయి.

శాస్ర్తోక్తంగా మట్టపల్లి వాసుని కల్యాణం

మఠంపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మట్టపల్లి క్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో విష్వక్ష్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన, మంగాల్య ధారణ తలంబ్రాలుతో కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదించిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరిమట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పధ్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణమ్మకు మంగళ హారతి

మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహుని క్షేత్రంలో శుక్రవారం కృష్ణమ్మకు మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర కృష్ణనదికి పసుపు, కుంకుమార్చనలు, అభిషేకాలు, సరెచీర సమర్పించి దీపాదనలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో కృష్ణమ్మకు మంగళ హారతి ఇచ్చి భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Dec 21 , 2024 | 12:49 AM