Hyderabad: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని ఏం చేశాడంటే..
ABN, Publish Date - Aug 29 , 2024 | 09:59 AM
ప్రియురాలిపై ప్రేమన్మాది కత్తితో దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ దాడి ఘటనలో యువతి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ అనే యువతి నల్లగండ్లలోని అపర్ణలో బ్యుటిషియన్‌గా పని చేస్తోంది.
హైదరాబాద్: ప్రియురాలిపై ప్రేమన్మాది కత్తితో దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ దాడి ఘటనలో యువతి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ అనే యువతి నల్లగండ్లలోని అపర్ణలో బ్యుటిషియన్‌గా పని చేస్తోంది. తన స్నేహితులతో కలిసి దీపన గచ్చిబౌలి గోపన్ పల్లి తండా సమీపంలో నివాసం ఉంటోంది. కొంత కాలం క్రితం దీపనకు కర్ణాటకకు జరిగిన రాకేష్‌తో పరిచయమైంది. పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. అయితే కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలంటూ దీపనను రాకేష్ వేధిస్తున్నాడు.
అయితే పెళ్లికి దీపన నిరాకరించింది. నిన్న రాత్రి దీపన ఇంటికి వెళ్లి రాకేష్ గొడవ పడ్డాడు. అవేశంతో ఊగిపోయిన రాకేష్.. అక్కడే ఉన్న కురగాయల కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దీపన తమాంగ్(25) మృతి చెందింది. దాడిని అడ్డుకోవడానికి ఆమె స్నేహితులు ప్రయత్నించారు. వారిపై కూడా రాకేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి మెయినాబాద్ సమీపంలో కనకమామిడి వద్దకు వెళ్లి రాకేష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కరెంటు పోల్ ఎక్కడానికి ప్రయత్నించి విద్యుత్ షాక్‌కి గురవడంతో గాయాలయ్యాయి. కనకమామిడి సమీపంలోని ఓ ఆసుపత్రికి స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Aug 29 , 2024 | 09:59 AM