ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: గుస్సాడీ కనకరాజు మృతిపై ప్రధాని సంతాపం

ABN, Publish Date - Oct 27 , 2024 | 03:43 AM

ప్రముఖ గుస్సాడీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

న్యూఢిల్లీ, జైనూర్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రముఖ గుస్సాడీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. గుస్సాడీ నృత్యానికి కనకరాజు చేసిన సేవలను మోదీ శనివారం ‘ఎక్స్‌’ వేదికగా కొనియాడారు. ‘‘ప్రముఖ నృత్యకారుడు, సాంస్కృతిక మణిదీపం కనకరాజు మరణం చాలా విచారం కలిగించింది.


గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించేందుకు ఆయన చేసిన కృషి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం’’ అని ట్వీట్‌ చేశారు. కాగా, గుస్సాడీ మృతదేహానికి మార్లవాయిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్మేలు కోవా లక్ష్మి, వెడ్మ బొజ్జు, మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివా్‌సరావు, తదితరులు నివాళులర్పించారు.

Updated Date - Oct 27 , 2024 | 03:43 AM