VC Sajjanar: ప్రధాని మోదీకి సజ్జనార్ ధన్యవాదాలు.. ఎందుకంటే
ABN, Publish Date - Oct 27 , 2024 | 04:44 PM
డిజిటల్ అరెస్టుల (Digital Arrest) పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇవాళ (ఆదివారం) ‘మన్ కీ బాత్' 115వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులపై ప్రధాని చేసిన ప్రసంగంపై సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
హైదరాబాద్: డిజిటల్ అరెస్టుల (Digital Arrest) పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇవాళ (ఆదివారం) ‘మన్ కీ బాత్' 115వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులపై ప్రధాని చేసిన ప్రసంగంపై సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
కర్ణాటకలోని విజయపూర్ చెందిన సందీప్ పాటిల్ అనే వ్యక్తిని బోల్తా కొట్టించబోయారని, అయితే నకిలీ పోలీసుతో పాటిల్ చాకచక్యంగా మాట్లాడుతున్న వీడియోను సెప్టెంబర్ 19న తొలుత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశానని, ఆ ట్వీట్ ఆధారంగా సందీప్ పాటిల్‌ను హోంశాఖ, పీవఓం గుర్తించాయని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు సంతోష్ పాటిల్ ధైర్యాన్ని మెచ్చుకున్నారని ప్రస్తావించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల నియంత్రణకు అవగాహన కోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు అని సజ్జనార్ పేర్కొన్నారు. కాగా సజ్జనార్ చేసిన ట్వీట్ ఆధారంగా సంతోష్ పాటిల్‌ను హోంశాఖ, పీఎంవో గుర్తించాయి.
నేటి మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారని, నకిలీ పోలీస్‌తో ఒక వ్యక్తి మాట్లాడిన వీడియోను షేర్ చేశారని సజ్జనార్ ప్రస్తావించారు. ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఎలా వ్యవహరించాడో ప్రస్తావించారని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైనా, లేక కేటుగాళ్లు సంప్రదించడానికి ప్రయత్నిస్తే వెంటనే 1930కి డయల్ చేయాలని సజ్జనార్ సూచించారు. సురక్షితమైన డిజిటల్ భారతదేశాన్ని రూపొందించేందుకు కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.
డిజిటల్ అరెస్టులపై ప్రధాని అవగాహన
కాగా డిజిటల్ అరెస్టుల (Digital Arrest) పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదివారం ‘మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తం చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ విచారణ చేపట్టదని సూచించారు. దీన్ని గమనించి పోలీసులు, ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ‘మన్ కీ బాత్' 115వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. దేశ ప్రజలుకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Oct 27 , 2024 | 05:27 PM