PM Modi: మేడారం జాతరపై ప్రధాని ట్వీట్
ABN, Publish Date - Feb 21 , 2024 | 11:04 AM
మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటని పేర్కొన్నారు. భక్తి, సంప్రదాయం, సమాజ స్పూర్తిల గొప్ప కలయిక ఇదని మోదీ తెలిపారు. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదామన్నారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని.. పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని ప్రధాని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మేడారం: మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర (Medaram Jatara) గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటని పేర్కొన్నారు. భక్తి, సంప్రదాయం, సమాజ స్పూర్తిల గొప్ప కలయిక ఇదని మోదీ తెలిపారు. మనం సమ్మక్క-సారక్క (Sammakka Sarakka)లకు ప్రణమిల్లుదామన్నారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని.. పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని ప్రధాని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మేడారం (Madaram) మహాజాతర (Maha Jatara) నేటి నుంచి ప్రారంభమైంది. మహా జాతరలో ఈరోజు తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ (Saralamma) రానుంది. ఆదివాసి సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు (Devotees) మేడారంకు పోటెత్తారు. వన దేవతల్లో ఒకరైన సారలమ్మ బుధవారం మేడారం గద్దె మీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకొస్తారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతోనే నాలుగురోజుల మహాజాతరకు తెరలేవనుంది. ఈ మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలవుతాయి.
Updated Date - Feb 21 , 2024 | 11:04 AM