Jagtial Drugs Case: జగిత్యాల డ్రగ్స్ కేసులో మరో సంచలన కోణం.. గంజాయి ఇచ్చి మరీ ఓ యువతిపై..
ABN, Publish Date - Mar 24 , 2024 | 04:26 PM
జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని గంజాయికి బానిస చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఏ తండ్రి అయితే ఈ గంజాయి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారో, ఆయన కుమార్తెపైనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది.
జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని గంజాయికి బానిస చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఏ తండ్రి అయితే ఈ గంజాయి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారో, ఆయన కుమార్తెపైనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. ఏడాది కాలంగా ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ నిందితులను ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌గా గుర్తించారు. వారిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: విశాఖ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలు!
కాగా.. ఎప్పుడూ ఆనందంగా, ఎంతో హుషారుగా కనిపించే కూతురిలో మార్పు రావడాన్ని ఓ తండ్రి గమనించారు. ఏమైందోనని ఆరా తీయగా.. ఆమె గంజాయికి బానిస అయ్యిందని, ఆమెపై అత్యాచారం కూడా జరిగిందని తండ్రి గుర్తించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తమకు లభించిన సమాచారం ఆధారంగా.. ఐదుగురు సభ్యులతో కూడిన ఓ ముఠాని అరెస్ట్ చేశారు. చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో వీళ్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారని, చదువు మానేసి వాళ్లు ఈ దందా నడుపుతున్నారని వెల్లడైంది. విశాఖపట్నంలోని సీలం నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి, జగిత్యాలలో అమ్ముతున్నట్టు కనుగొన్నారు. పాఠశాల విద్యార్థుల్ని టార్గెట్ చేసుకొని, మాయమాటలతో వారిని బుట్టలో పడేసి, గంజాయికి బానిసలు చేశారు.
Read Also: జగిత్యాల డ్రగ్స్ కేసులో బ్లాస్టింగ్ ట్విస్ట్.. చదువు మానేసి మరీ..
ఆ గంజాయి ముఠా చేసిన పనికి మొత్తం 10 మంది పదో తరగతి విద్యార్థినులు.. మత్తుకి అలవాటు పడినట్లు అధికారులు గుర్తించారు. వాళ్లు పూర్తిగా కోలుకునేందుకు గాను రిహాబ్ సెంటర్‌కు తరలించారు. మరోవైపు.. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితుల్ని గుర్తించి, వారిపై సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేశారు. అలాగే.. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ డ్రగ్స్ వ్యవహారంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
Updated Date - Mar 24 , 2024 | 04:26 PM