ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Kaushik Reddy: కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..

ABN, Publish Date - Sep 12 , 2024 | 09:50 AM

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఉదయమే కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


నేడు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన తెలంగాణ భవన్ కు తీసుకువస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఆయన నివాసం ముందు మోహరించారు. మరోవైపు అరికెపూడి గాంధీ నివాసం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరికెపూడి గాంధీ సైతం కౌశిక్ రెడ్డికి రివర్స్ సవాల్ విసిరారు. ‘11 గంటలకు వస్తా అన్నావు.. రాకుంటే నేను నీ ఇంటికి 12 గంటలకు వస్తా.. నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందాం’ అని అరేకపూడి గాంధీ ఛాలెంజ్ చేశారు. దీంతో ఇరువురి ఇంటి వద్దా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తన ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏమీ అవసరం లేదని అరికెపూడి గాంధీ అంటున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 10:05 AM

Advertising
Advertising