Police Gratitude: సీఎం రేవంత్‌కు పోలీసుల కృతజ్ఞతలు
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:31 AM
తమ సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పోలీసు సిబ్బంది తరపున పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : తమ సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పోలీసు సిబ్బంది తరపున పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. పోలీసు కుటుంబం నుంచి వచ్చిన సీఎంకు పోలీసులు ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు.
సిబ్బంది వేతనంలో ఎక్కువ మొత్తం పిల్లల చదువులకే పోతుందని, అలాంటిది సైనిక్ స్కూల్ తరహాలో 50 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో మెరుగైన విద్య పోలీసు పిల్లలకు అందించేందుకు సీఎం చొరవ చూపడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్, వరంగల్‌లో మరో రెండేళ్లలో పోలీసు స్కూళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పడంతోపాటు దశల వారీగా పోలీసుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Sep 13 , 2024 | 04:31 AM