ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Political Drama: రాజకీయం @ హైడ్రా!

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:30 AM

హైడ్రా రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇతర అన్ని అంశాలూ పక్కకుపోయి.. హైడ్రా చుట్టూనే రాజకీయం నడుస్తోంది.

  • కూల్చివేతలపై పార్టీల పరస్పర ఆరోపణలు.. తప్పుబట్టే సాహసం చేయలేని పరిస్థితి

  • ఒకరి ఫాంహౌస్‌ రహస్యాలు మరొకరు.. బయట పెట్టుకుంటున్న నేతలు

  • గందరగోళం సృష్టించేందుకు.. ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు

  • హైడ్రా చర్యలకు ప్రజల నుంచి ఆదరణ

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హైడ్రా రంగప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇతర అన్ని అంశాలూ పక్కకుపోయి.. హైడ్రా చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఒకరిపై మరొకరు ప్రశ్నలు, లీకులు సంధించుకుంటూ రాజకీయ డ్రామాకు తెరలేపుతున్నాయి. హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై అన్ని పార్టీలు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నాయి. కూల్చివేతలు తప్పు అనే సాహసం చేయలేక ‘ఇది కూల్చారు సరే.. మరి అది కూలుస్తారా!’ అంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా తమ లోపాలను బయటపెట్టుకుంటున్నారు.


దీనికి అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలు ఏవీ మినహాయింపు కాదన్న రీతిలో పరిస్థితి ఉంది. జన్వాడ ఫాంహౌస్‌ పేరు తెరపైకి రాగానే బీఆర్‌ఎస్‌ ఇలాంటి విమర్శలు మొదలుపెట్టింది. జన్వాడ ఫాంహౌస్‌ తనది కాదని చెబుతూ కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతల ఫాంహౌ్‌సలు కూడా నీళ్లలోనే ఉన్నాయన్నారు. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కేవీపీ, పట్నం మహేందర్‌ రెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామిల ఫాంహౌ్‌సలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉన్నాయనీ, ముందుగా వాటిని కూల్చాలని డిమాండ్‌ చేశారు. ఆయన సోషల్‌ మీడియా టీమ్‌.. కొందరు కాంగ్రెస్‌ నేతల ఫాంహౌ్‌సలపై ప్రత్యేక కథనాలు చేసి మరీ, ‘వీటిని కూడా కూలుస్తారా? అంటూ ప్రశ్నించింది. తనపై చేసిన ఆరోపణలకు పొంగులేటి సమాధానం ఇస్తూ ‘మీరే టేపు తెచ్చుకొని కొలుచుకోండి. అక్రమం అని తేలితే నేనే కూలుస్తా’ అంటూ సవాల్‌ విసిరారు.


పోటాపోటీగా మీడియాకు లీకులు..

కేటీఆర్‌ ఆరోపణలతో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా టీమ్‌ అలర్ట్‌ అయింది. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం నేతలకు సంబంధించిన కొన్ని నిర్మాణాల మ్యాపులను విడుదలచేసింది. దీంతో హైడ్రా అధికారులు తమకు సంబంధించిన కొన్ని కట్టడాలపై మీడియాకు కొన్ని లీకులిచ్చారని విపక్ష నేతలు ఆరోపించారు. మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు.. రాజకీయ నేతలకు చెందిన అక్రమ నిర్మాణాల శాటిలైట్‌ మ్యాపులను విడుదల చేశాయి. ఒక సంస్థ పాత నగరానికి చెందిన చెరువుల ఆక్రమణలపై మ్యాపులను ప్రదర్శించింది. దీనిపై బీజేఎల్‌పీ నేత మహేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ.. హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే ముందు పాత నగరంలోని చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు.


బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌, కవితకు 111 జీవో పరిధిలో ఫాంహౌ్‌సలు ఉన్నాయనీ, వాటిని కూల్చాలని అన్నారు. రెండు దశాబ్దాలుగా జరుగుతున్న కట్టడాలన్నింటినీ కూల్చాలన్నారు. ఆ పార్టీ మరో ఎంపీ ఈటల రాజేందర్‌ మాత్రం సామాన్యుల జోలికొస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. మరోవైపు హైడ్రా పరిధిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కాగా, అక్రమంగా నిర్మించిన కట్టడాలు ఎవరివైనా కూలుస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఓవైపు ప్రజల నుంచి హైడ్రాకు ఆదరణ లభిస్తుంటే, రాజకీయ పార్టీల నేతలు మాత్రం పరస్పర ఆరోపణలతో మొత్తం వ్యవహారాన్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 27 , 2024 | 07:44 AM

Advertising
Advertising
<