అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:39 AM
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నవంబరు 1న శ్రీకారం: మంత్రి పొంగులేటి
తిరుమలాయపాలెం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నవంబరు 1న ఈ పథకానికి శ్రీకారం చుడతామని చెప్పారు. మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు, గోల్‌తండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విడతలవారీగా అర్హులైన పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
Updated Date - Oct 30 , 2024 | 05:39 AM