ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma Houses: ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల్లో..

ABN, Publish Date - Nov 14 , 2024 | 04:18 AM

మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.

  • స్నానాల గది, వంట గది తప్పనిసరి.. తొలి విడతలో స్థలం ఉన్నవారికి మంజూరు

  • నాలుగు విడతల్లో రూ.5 లక్షలు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు. లబ్దిదారుడు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలన్నారు. అందులో స్నానాల గది, వంట గది తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారునికి ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ. 5 లక్షలు ఇస్తుందని తెలిపారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే రూ. లక్ష, లెంటల్‌ లెవల్‌కు చేరగానే రూ.1.25 లక్షలు, స్లాబు వేశాక రూ. 1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో మిగిలిన లక్ష రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. గ్రామ సభలను నిర్వహంచి పేదల్లో బహుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని, ఇంటిని ఇంటి యజమానురాలి పేరునే మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి వినతిపత్రాలే వచ్చాయని వెల్లడించారు.


డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నమూనాలు చూపించి గెలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. పదేళ్లు అధికారంలో ఉండి కట్టించలేదని విమర్శించారు. అలాగే ధరణి సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపైనా వినతులు వచ్చాయని చెప్పారు. కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దడం పూర్తికావచ్చిందన్నారు. త్వరలోనే దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచే కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో కనుసైగలతో ప్రభుత్వ స్థలాలను తమ పేరిట మార్చుకున్నారని, ఆ స్థలాలను తిరిగి తీసుకుని పేదవాళ్లకు ఇస్తామని పేర్కొన్నారు. కొంత మంది అర్హులైన రైతులకు రూ.13 వేల కోట్ల మేరకు రుణాలను మాఫీ చేయాల్సి ఉందని, డిసెంబరు నెలలోపున ఆ రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పండిన ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులను జైల్లో పెట్టిన విషయాన్ని మరిచిపోయి ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.


  • వికారాబాద్‌ ఘటన వెనుక ఉన్నదెవరో తేల్చుతాం

వికారాబాద్‌ ఘటన వెనుక ఉన్న వారు ఎవరో అతి త్వరలో తేల్చేసి మీడియా ముందు ఉంచుతామని మంత్రి పొంగులేటి చెప్పారు. రైతుల ముసుగులో కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్న అధికారులను, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అనే పేరు ముందు పెట్టి ముసుగు వెనక ఎవరు ఉన్నారో బయటపెడుతామని స్పష్టం చేశారు. కాగా, బుధవారంనాటి మంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి 300 వరకూ దరఖాస్తులను మంత్రి పొంగులేటి స్వీకరించారు. పలు సమస్యలకు సంబంధించి కలెక్టర్లకు ఫోన్లు చేసి పరిష్కరించాల్సిందిగా మంత్రి సూచించారు.

Updated Date - Nov 14 , 2024 | 04:18 AM