ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మరో 10 అంశాలు

ABN, Publish Date - Dec 13 , 2024 | 03:56 AM

ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకొచ్చిన యాప్‌లో మరో 10 కొత్త అంశాలను చేర్చామని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

  • 8 2.32 లక్షల దరఖాస్తుల అప్‌లోడ్‌

  • ‘ప్రజాపాలన‘లో దరఖాస్తు చేసుకోని వారికీ చాన్స్‌

  • సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తాం

  • 31వ తేదీలోగా మంత్రి వర్గ విస్తరణ

  • మీడియాతో చిట్‌చాట్‌లో పొంగులేటి

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకొచ్చిన యాప్‌లో మరో 10 కొత్త అంశాలను చేర్చామని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. కొత్త ఆర్వోఆర్‌ చట్టం అమల్లోకి వచ్చాక భూ ఆక్రమణలకు పాల్పడిన వారి వివరాలన్నీ బయటపెడతామని పునరుద్ఘాటించారు. గురువారం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో సర్వే అధికారుల సిఫార్సు కాలమ్‌ను తొలగించామన్నారు. ఇప్పటి వరకు యాప్‌ ద్వారా 2.32 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కొంత జాప్యం జరిగినా నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. సంక్రాంతి లోపల వీఆర్‌వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు.తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్వోఆర్‌ -2024 బిల్లును ఆమోదిస్తామని, చట్టం అమల్లోకి వచ్చాక మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణలకు పాల్పడిన వారి చిట్టాను అన్ని ఆధారాలతో బయట పెడతామన్నారు. కొత్త ఆర్వోఆర్‌ బిల్లులో 1971లో వచ్చిన ఆర్వోఆర్‌ చట్టంలోని మంచి విషయాలనూ తీసుకున్నామన్నారు.


ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి ఆర్వోఆర్‌పై సలహాలు ఇవ్వాలని సూచించారు. తాను, సీఎం రేవంత్‌రెడ్డి 80 వేల పుస్తకాలు చదవలేదని, అన్ని పుస్తకాలు చదివిన కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు కనీసం 5వేల పుస్తకాలు చదివినా.. వాళ్ల సూచనలు తీసుకునే వాళ్లమని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సూచనలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పుడు విగ్రహంపై గోల చేస్తున్న వారు.. గతంలో అధికారిక ప్రకటన చేశారా? అని ప్రశ్నించారు. ఽ రైతులకు బేడీలు వేయడం సరైన పద్ధతి కాదని, ఈ ఘటనపై సీఎం రేవంత్‌ తీవ్రంగా స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లనే వసతి గృహాల్లో ఆహార కల్తీ వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. 14వ తేదీన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ హాస్టళ్లలోనే భోజనం చేయనున్నామని తెలిపారు.

Updated Date - Dec 13 , 2024 | 03:56 AM