ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: మహిళా సంఘాల ద్వారా బస్సుల కొనుగోలు

ABN, Publish Date - Aug 31 , 2024 | 04:01 AM

ఆర్టీసీకి అవసరమైన బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

  • మొదటి దశలో 600 బస్సులు: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌, ఆగస్టు 30 : ఆర్టీసీకి అవసరమైన బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మొదటి దశలో 600 బస్సులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి గ్రామైక్య సంఘాల అధ్యక్షులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.


త్వరలో మహిళా సంఘాలు బస్సు యజమానులు కాబోతున్నారని వెల్లడించారు. స్త్రీ శక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలను మహిళలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. హుస్నాబాద్‌లో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని, మండల సమాఖ్యల ద్వారా యూనిట్లను నెలకొల్పేందుకు ప్రోత్సహం అందిస్తామని చెప్పారు.

Updated Date - Aug 31 , 2024 | 04:01 AM

Advertising
Advertising