ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: బస్తీ నిద్ర కేసీఆర్‌ దిశా నిర్దేశమే: పొన్నం

ABN, Publish Date - Nov 17 , 2024 | 04:29 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ బిడ్డ అయితే.. డీఎన్‌ఏ పరీక్ష చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆయన తెలంగాణ బిడ్డ అయితే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి కానీ.. అవరోధంగా ఎందుకు మారారని ప్రశ్నించారు.

కాళోజీ జంక్షన్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ బిడ్డ అయితే.. డీఎన్‌ఏ పరీక్ష చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆయన తెలంగాణ బిడ్డ అయితే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి కానీ.. అవరోధంగా ఎందుకు మారారని ప్రశ్నించారు. ఈ నెల 19న హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో కాంగ్రెస్‌ ప్రజాపాలన సభ నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి పొన్నం సభా మైదానాన్ని పరిశీలించారు. .


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ నది ప్రకాళన చేపడితే.. మూసీ నిద్రతో కిషన్‌రెడ్డి అడ్డుకోవడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. తొలి నుంచీ కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే కిషన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ సూచన మేరకే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సంజయ్‌ నుంచి కిషన్‌రెడ్డికి అప్పగించారని అన్నారు. కిషన్‌రెడ్డి మూసీ నిద్ర కూడా కేసీఆర్‌ డైరెక్షనే అని ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడానికి కేసీఆర్‌.. కిషన్‌రెడ్డిని ఉసిగొల్పుతున్నారని పేర్కొన్నారు

Updated Date - Nov 17 , 2024 | 04:29 AM