ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ABN, Publish Date - Dec 14 , 2024 | 05:09 AM

రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వేను విజయవంతం చేసేందుకు కుల సంఘాలు, దళిత, గిరిజన, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

  • సంక్షేమ పథకాల అమలుకు సర్వే సమాచారం కీలకం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • మంత్రితో బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వేను విజయవంతం చేసేందుకు కుల సంఘాలు, దళిత, గిరిజన, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ప్రభుత్వం ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సర్వే సమాచారం కీలకమని చెప్పారు. కులాల వారీగా సంఖ్య తెలియకుంటే వారికి రావాల్సిన పథకాలు, రిజర్వేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉం టుందన్నారు. సంచార జాతులు,్చ్చ్చ్చప్రతినిధులు చొరవ తీసుకుని సర్వే బృందాలకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సర్వే సమాచారం ఒక ప్రధాన ఆధారం అవుతుందన్నారు.


త్యాగానికి మారుపేరు యేసుక్రీస్తు: పొన్నం

త్యాగానికి మారుపేరైన యేసుక్రీస్తు సమాజంలో అందరికీ క్షమాగుణం ఉండాలని ప్రబోధించారని, లోకకల్యాణం కోసం అందరూ యేసు ప్రభువుకు ప్రార్థనలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం సచివాలయంలో క్రిస్టియన్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సచివాలయం చర్చిలో జరిగిన గ్రాండ్‌ క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం సెక్యులర్‌ భావాలతో అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంకు ఆశీర్వచనం చేస్తూ బ్రదర్‌ అనిల్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మైనారిటీ నాయకుడు అనిల్‌ థామస్‌, రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌, క్రిస్టియన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రతినిధులు చిట్టి బాబు, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, సువర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 05:09 AM