ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: అధికార్లపై దాడి చేస్తే ఊరుకోం

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:45 AM

అధికారులపై దాడులు చేస్తే ఎంతమాత్రం సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాం. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నాం.

  • కొడంగల్‌లో పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసనలు తెలపొచ్చు: పొన్నం

  • సిరిసిల్ల నేత కార్మికులకు త్వరలో మహిళా సంఘాల చీరల ఆర్డర్లు

  • 20న సిరిసిల్ల జిల్లాలో సీఎం పర్యటన

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌

సిరిసిల్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అధికారులపై దాడులు చేస్తే ఎంతమాత్రం సహించబోమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాం. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నాం. దాన్ని అవకాశంగా తీసుకొని అధికారులపై దాడులు చేస్తే ఊరుకోబోం’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌ ప్రమాణ స్వీకారోత్సవ సభకు మంత్రి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌లో పరిశ్రమ పెట్టడం ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసన తెలపవచ్చని, ఇందిరా పార్కు వద్ద ధర్నా, ర్యాలీ, దీక్షలు చేయవచ్చని అన్నారు. అధికారులపై దాడులు చేస్తే మాత్రం చట్టప్రకారంగా చర్యలు తప్పవని హెచ్చ రించారు. మల్లన్నసాగర్‌, మిడ్‌ మానేరు బాధితులను గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో తనకు తెలుసని చెప్పారు.


కొడంగల్‌లో కలెక్టర్‌పై దాడి విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కలెక్టర్‌పై దాడి చేసినవారిని అరెస్టు చేయకుండా ఏం చేయాలో ప్రభుత్వానికి కేంద్రమంత్రి సూచించాలన్నారు. అనంతరం.. సీఎం రేవంత్‌ ఈ నెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సిరిసిల్లలో నేత కార్మికుల కోసం మనోధైర్య ర్యాలీ నిర్వహిస్తామని పొన్నం తెలిపారు. నేతన్నల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వం తరఫున సిరిసిల్లలో ఒకరోజు గ్రీవెన్స్‌ సెల్‌(ఫిర్యాదుల స్వీకరణ) నిర్వహిస్తామన్నారు. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పలు పథకాలను అందుబాటులోకి తెచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సీఎం 20న జిల్లాకు రానున్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు ముందుకు వస్తాయని భరోసా ఇచ్చారు. బతుకమ్మ చీరల స్థానంలో మహి ళా సంఘాలకు అందించే చీరల ఆర్డర్లు త్వరలోనే ఇస్తామన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 04:45 AM