ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: తెలంగాణ భవన్‌లో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు

ABN, Publish Date - Dec 08 , 2024 | 06:34 PM

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఢిల్లీ, డిసెంబర్ 08: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2024, డిసెంబర్ 7 వ తేదీ నాటికి ఏడాది పూర్తి చేసుకుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. గతేడాది అంటే.. 2023, డిసెంబర్ 7వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్ బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో చోటు చేసుకున్న కీలక పరిణామాలను సోదాహరణగా వివరించారు.

Also Read: Viral Video: మామగారిని చితక్కొట్టిన కోడలు.. వీడియో వైరల్


  • రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటలలోనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు.. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్ జండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని రూ. 5 నుంచి రూ. 10 లక్షలకు ప్రభుత్వం పెంచిందని తెలిపారు. అదే విధంగా ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్య మొత్తాన్ని 1,835 కి పెంచింది.

  • అభయహస్తం హామీల అమలు కోసం "ప్రజాపాలన" కార్యక్రమం నిర్వహించిందని గుర్తు చేశారు.

  • ప్రగతి భవన్‌ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చి.. "ప్రజావాణి" కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు.

  • ఇచ్చిన హామీలకు కట్టుబడి, రూ. 500లకే వంట గ్యాస్ సిలెండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు.

    Also Read: తిరుమల బాహుబలి తీర్థం విశిష్టతలు తెలుసా..?


  • పేద, బడుగువర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు భట్టి విక్రమార్క్.. శాసన సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు సమర్పించారన్నారు.

  • కవులు, కళాకారులు, సినిమా రంగానికి చెందినవారికి ప్రజా కళాకారుడు గద్దర్ పేరిట అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా ప్రస్తావించారు.

  • స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారని.. ఈ సందర్బంగా సుమారు రూ. 40 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్.. అమెరికా, దక్షిణ కొరియాలలో జరిపిన పర్యటనలలో రూ. 36,000 కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయన్నారు.

    Also Read: కుంకుడు కాయలతో తల స్నానం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


  • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూపీఎస్సీ తరహాలో.. పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని వివరించారు.

  • పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించి.. వారికి రూ. 25 లక్షల నగదు బహుమతితోపాటు ప్రతి నెల రూ. 25 వేల పెన్షన్‌ను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.

  • అధికారంలోకి వచ్చిన 11 మాసాలలోనే 50 వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేశారని... ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితిని 44 నుంచి 46 సంవత్సరాలకు పెంచిందన్నారు. మోగా డీఎస్సీ‌ని నిర్వహించి 11,062 మంది ఉపాధ్యాయులకు ఒకే రోజు నియామక పత్రాలను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని ఏపీ జితేందర్ రెడ్డి వివరించారు.

  • ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు అనుగుణంగా 65 ఐటిఐలను ఏటీసీ (అదునాతన సాంకేతిక కేంద్రాలు) గా తీర్చిదిద్దుతోందన్నారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటిఐలో ఏటీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో "యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సి‌టీ" కి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. ఈ స్కిల్‌ యూనివర్సిటీ కోర్సులను ఈ ఏడాది నుంచే ప్రారంభించిందని చెప్పారు.

    Also Read: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..


  • రాష్ట్ర ప్రభుత్వం 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” పథకాన్ని ప్రారంభించి, సివిల్స్ మెయిన్స్‌కు అర్హత పొందిన 135 మందికి ఒక్కొక్కరికి రూ. లక్ష వంతున ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు.

  • జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిందని గుర్తు చేశారు.

  • రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర జాబ్ క్యాలెండర్‌ను సైతం విడుదల చేసిందన్నారు.

  • గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పలు చర్యలు తీసుకుంటుందని వివరించారు.


  • హైదరాబాద్‌లో కృత్రిమ మేధపై అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించారన్నారు.

  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించినట్లు వివరించారు.

  • ఈ ఏడాదిలో మొత్తం 8 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు సాధించిందని వివరించారు.

  • చేనేత కార్మికుల ప్రయోజనార్థం "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ " (ఐ.ఐ.హెచ్.టి) ని ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారన్నారు. దీనికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. చేనేత అభయహస్తం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించిందని వివరించారు.


  • ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు కబ్జాలకు గురి కాకుండా హైడ్రాను రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

  • హైదరాబాద్‌లో మెట్రో రెండవ దశకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు.

  • రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని వివరించారు.

  • తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూతన భవనాల కోసం రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల భూమిని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని వివరించారు.


  • రాష్ట్రంలో వ్యవసాయ రంగంతోపాటు, అన్ని వర్గాలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తోందని.. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తోందన్నారు.

  • ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోనే రైతన్నలకు ఏక కాలంలో రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేసిందని.. 22 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారు రూ. 18 వేల కోట్లు జమ చేసి వారిని రుణ విముక్తులను చేసిందని వివరించారు.

  • పంట పెట్టుబడి కోసం తొలివిడత 69 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు వారి వారి ఖాతాలలో జమచేసిందని... రాష్ట్రంలో సన్నరకం వరిధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అందించడం జరుగుతోందన్నారు.

  • రిజర్వాయర్లలో చాలాకాలంగా పేరుకుపోయిన పూడికలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.


  • అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలలలో మౌలిక సదుపాయల కల్పనకు రూ. 1,135 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని... పాఠశాలల నిర్వహణా బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందన్నారు.

  • సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారని గుర్తు చేశారు.

  • మూసీ నదిని శుద్ధిచేసి, పునరుజ్జీవనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.

  • రాష్ట్రంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు.


  • హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లతోపాటు ఫోర్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.

  • రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రయోజనార్థం కులగణన సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోందని గుర్తు చేశారు.

  • సింగరేణి ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా, లాభాల వాటా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదన్నారు.

  • హైదరాబాద్‌లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి భూమిపూజ సైతం జరిగిందని తెలిపారు.


  • బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విద్యార్థులకు డైట్‌ (40శాతం), కాస్మోటిక్స్‌ (200 శాతం) ఛార్జీల పెంచారని గుర్తు చేశారు.

  • తెలంగాణ భవన్‌లో జరిగి ఈ కార్యక్రమానికి రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్‌తోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఢిల్లీలోని తెలుగు వాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

    For Telangana news And Telugu news

Updated Date - Dec 08 , 2024 | 06:35 PM