ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jain temple: జైన మందిరానికి పూర్వవైభవం పురావస్తు శాఖ అధికారుల ప్రణాళిక

ABN, Publish Date - Oct 28 , 2024 | 04:54 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో శిథిలావస్థలోని పురాతన జైన మందిరాన్ని(గొల్లతగుడి) పునరుద్ధరించేందుకు పురావస్తు శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. క్రీ.శ 6-7శతాబ్దాల్లో రాష్ట్ర కూటుల కాలంలో కాల్చిన

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో శిథిలావస్థలోని పురాతన జైన మందిరాన్ని(గొల్లతగుడి) పునరుద్ధరించేందుకు పురావస్తు శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. క్రీ.శ 6-7శతాబ్దాల్లో రాష్ట్ర కూటుల కాలంలో కాల్చిన ఇటుకలు, సున్నంతో 65 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం విశేషం. వందల ఏళ్ల క్రితం జడ్చర్ల ప్రాంతం జైనుల ఆవాస ప్రాంతంగా, విలసిల్లినట్లు పలు ఆధారాలున్నాయి. 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయం గొల్లతగుడితో పాటు పరిసర ప్రాంతాల్లో పలు చిన్న ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయి.


దశాబ్దాల క్రితం ఇక్కడ లభ్యమైన అయిదు అడుగుల ఎత్తైన జైనతీర్థంకరుల విగ్రహాన్ని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని మ్యూజియానికి తరలించి భద్రపరిచారు. ఈ మేరకు గొల్లతగుడిని పరిరక్షించేందుకు ఇప్పటికే రూ.36 లక్షల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం, జైనమత సంస్థలు పునరుద్ధరణ పనులకు నిధులు సమకూర్చడానికి ముందుకు వచ్చాయి.

Updated Date - Oct 28 , 2024 | 04:54 AM