PRTU: టీచర్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలి: పీఆర్టీయూ
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:21 AM
ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు.
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి కోరారు. 33 జిల్లాల పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శుల సమావేశం శుక్రవారం హైదరాబాద్లోని యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. టీచర్లకు సంబంధించి జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవ్, టీఎ్సజీఎల్ఐ వంటి బిల్లులన్నీ గత ఏడాదిన్నర కాలంలో పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. ఈ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Updated Date - Nov 16 , 2024 | 04:21 AM