ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొంగులెత్తిన మృత్యుంజయుని కారుణ్యమే పురాణపండ ‘శంకర .. శంకర’

ABN, Publish Date - Aug 04 , 2024 | 11:59 PM

భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యుల్లో కొంతైనా బ్రతుకుతున్నదంటే స్తోత్ర సాహిత్య ప్రభావమేనన్న సత్యాన్ని ఆధునికులు సైతం అంగీకరించవలసినదేనని ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాజాగా ఆయన రాయదుర్గం సమీపంలోని శ్రీమరకత మహాలింగాన్ని దర్శించుకుని, అభిషేకార్చనల్లో పాల్గొన్న అనంతరం మంగళమయ లింగార్చనలు, అపురూప శివస్తోత్రాల మాధుర్యం నిండిన ‘శంకర ... శంకర’ గ్రంధాన్ని ఆవిష్కరించారు.

హైదరాబాద్, ఆగస్ట్ 4: భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యుల్లో కొంతైనా బ్రతుకుతున్నదంటే స్తోత్ర సాహిత్య ప్రభావమేనన్న సత్యాన్ని ఆధునికులు సైతం అంగీకరించవలసినదేనని ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు.

రాయదుర్గం సమీపంలోని శ్రీమరకత మహాలింగాన్ని దర్శించుకుని, అభిషేకార్చనల్లో పాల్గొన్న అనంతరం పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ... అరిష్టాలు పోగొట్టే మహా మంత్రరాశిగా అనాదిగా కీర్తించబడుతున్న రుద్ర నమక చమక మంత్ర శక్తిని మనః పీఠంపై నిలుపుకుంటే మృత్యుంజయుని కారుణ్యం పొంగులెత్తి కాపాడుతుందని చెప్పారు.

మంగళమయ లింగార్చనలు, అపురూప శివస్తోత్రాల మాధుర్యం నిండిన ‘శంకర ... శంకర’ అద్భుత గ్రంధాన్ని ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆవిష్కరించారు. భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వ శక్తిమంతమైన శివస్తోత్రాలతో విరాజిల్లుతున్న ‘శంకర ... శంకర’ గ్రంధం భక్తజనుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ కమిటీవారు శ్రీనివాస్‌కి ఘనంగా స్వాగతం పలికారు.

Updated Date - Aug 05 , 2024 | 01:08 AM

Advertising
Advertising
<