ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: రాహుల్ పెళ్లిపై రఘునందర్ హాట్ కామెంట్స్..

ABN, Publish Date - Aug 22 , 2024 | 06:22 PM

లోక్‌సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెళ్లి వార్తలపై మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్: లోక్‌సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెళ్లి వార్తలపై మెదక్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీకి పెళ్లి అయిందని బంగ్లాదేశ్ వార్తాపత్రిక బ్లిట్జ్‌లో వార్త వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ పత్రికలో రాహుల్‌తో ఉన్న అమ్మాయి ఎవరని రఘునందన్ ప్రశ్నించారు.


"రాహుల్ గాంధీ విదేశీ జర్నలిస్టులు రాసిన పత్రికలనే నమ్ముతారు. అందులో వార్తలు రాసే వ్యక్తి ఒక షేర్స్ బ్రోకర్. హిండెన్ బర్గ్ నమ్మిన రాహుల్ బంగ్లాదేశ్ బ్లిడ్జ్ పేపర్‌ను కూడా నమ్మాలి. ఆ పేపర్‌లో రాహుల్ గురించి స్పష్టంగా రాశారు. కాంగ్రెస్ నేతలు హిండెన్ బర్గ్‌ను నమ్మితే నేను బ్లిట్జ్‌ను నమ్ముతా. అందులో ప్రచురితమైన ఫొటోలో రాహుల్‌తో ఉన్న అమ్మాయిలు ఎవరు? రాహుల్ పెళ్లి చేసుకున్నారా? లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అనేది తేలాలి. సీఎం రేవంత్.. రాహుల్ అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను ఢిల్లీకి వెళ్లి రాహుల్‌కి బ్లిట్జ్ పేపర్ చూపిస్తా.

అదానీ తప్పుడు వ్యక్తి అయితే ఆయనతో ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? సెబీ ఛైర్మన్ అయితే షేర్స్ కొనకూడదా? హిండెన్ బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్‌ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఎక్కడా అవకతవకలు జరగలేదని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అదానీతో ఒప్పందాలు చేసుకుంటారు. కానీ వాళ్ళ పార్టీ నేతలు మాత్రం అదానీ వ్యాపారాన్ని ప్రశ్నిస్తారు. మా తమ్ముడు దందా చేయొద్దా అని సీఎం రేవంత్ అంటున్నారు. ముందు దందా అని దేన్ని అంటారో సీఎం తెలుసుకోవాలి. అక్రమ పనులను దందా అంటారు. బాంబే రెడ్ లైట్ ఏరియాకి వెళ్తే దందా అంటే ఏంటో చెప్తారు. ప్రధాని మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడిన బీఆర్ఎస్‌కు ఏ గతి పట్టిందో, కాంగ్రెస్‌కు అదే గతి పడుతుంది" అని రఘునందన్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి...

Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్

CM Revanth Reddy: బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు: సీఎం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 06:22 PM

Advertising
Advertising
<