ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: గిగ్‌ వర్కర్ల విధానంపై సంప్రదింపులు జరపండి

ABN, Publish Date - Nov 21 , 2024 | 03:54 AM

తెలంగాణ రాష్ట్ర గిగ్‌ వర్కర్ల విధానం ముసాయిదా రూపకల్పనకు అన్ని పక్షాలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరారు. అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోవడం వల్ల పటిష్ఠ, ప్రభావవంతమైన విధానాన్ని రూపొందించవచ్చని తెలిపారు.

  • అప్పుడే పటిష్ఠ విధానాన్ని రూపొందించొచ్చు

  • సీఎం రేవంత్‌కు రాహుల్‌ లేఖ

  • మీ ఆలోచనకు అనుగుణంగానే కొత్త విధానం

  • రాహుల్‌కు బదులిచ్చిన రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గిగ్‌ వర్కర్ల విధానం ముసాయిదా రూపకల్పనకు అన్ని పక్షాలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరారు. అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోవడం వల్ల పటిష్ఠ, ప్రభావవంతమైన విధానాన్ని రూపొందించవచ్చని తెలిపారు. ఇటీవల తాను హైదరాబాద్‌ వచ్చినప్పుడు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై వివిధ వర్గాలతో నిర్వహించిన సంప్రదింపుల ప్రక్రియ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఒక చట్టం, విధానాన్ని రూపొందించేటప్పుడు ప్రజల నుంచి నేరుగా అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. గిగ్‌ వర్కర్ల విధానం ముసాయిదాపైనా ఇదే తరహా ప్రక్రియ నిర్వహించాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు రాహుల్‌ లేఖ రాశారు. గడిచిన దశాబ్ద కాలంలో లక్షలాది మంది గిగ్‌ కార్మికులుగా చేరారన్నారు.


ఈ వ్యవస్థలో కార్మికుల శ్రమ దోపిడీ, ఇతర సమస్యల పరిష్కార యంత్రాంగం లేదని, వారు సామాజిక వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిగ్‌ కార్మికుల రక్షణ, సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో చెప్పామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఆ దిశగా చర్యలూ తీసుకున్నాయన్నారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారి గిగ్‌ కార్మికుల సంక్షేమానికి చట్టం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా గిగ్‌ కార్మికుల సంక్షేమం కోసం కొత్త విధానంతో ముందుకు సాగుతున్నందుకు సంతోషిస్తున్నానన్నారు. ఈ నెల 11న సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ ఈ మేరకు లేఖ రాశారు. దీనికి సీఎం బదులిస్తూ.. రాహుల్‌ ప్రజలకు ఇచ్చిన హామీ, ఆయన ఆలోచనకు అనుగుణంగా సమగ్ర గిగ్‌ వర్కర్ల విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఆయన గర్వపడేలా చేయడం తమకు మరింత శక్తినిస్తోందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో రాహుల్‌ రాసిన లేఖను పోస్ట్‌ చేశారు.

Updated Date - Nov 21 , 2024 | 03:54 AM