Share News

దేశంలోనే నం.1 ఠాణాగా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:25 AM

తెలంగాణ పోలీసులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశంలోనే బెస్ట్‌ పోలీ్‌సస్టేషన్‌గా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ నిలిచింది.

దేశంలోనే నం.1 ఠాణాగా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశంలోనే బెస్ట్‌ పోలీ్‌సస్టేషన్‌గా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ నిలిచింది. కేసులు సత్వర పరిష్కారం, ఆధారాల సేకరణ, కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వాడకం, నేరం రుజువుచేసి నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా చేయడం, ఫైళ్లను భద్రపర్చడం.. వంటి అనేక అంశాల్ని ప్రామాణికంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌-2023 జాబితాలో రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ మొదటిస్థానంలో నిలిచింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో శుక్రవారం జరిగిన పోలీసు డైరెక్టర్‌ జనరల్స్‌/ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ అఖిల భారత సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేతులమీదుగా రాజేంద్రనగర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎ్‌సహెచ్‌వో) బి.నాగేంద్రబాబు.. ఉత్తమ పోలీ్‌సస్టేషను ట్రోఫీని అందుకున్నారు. దేశంలోనే అత్యుత్తమ పోలీ్‌సస్టేషన్‌గా రాజేంద్రనగర్‌ పీఎస్‌ నిలవడం పట్ల ఆ స్టేషను సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీ సాధించడం పట్ల ఎస్‌హెచ్‌వో నాగేంద్రబాబును డీజీపీ రవిగుప్తా అభినందించారు. సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 07:38 AM