1100 గ్రాముల గంజాయి పట్టివేత
ABN, Publish Date - Dec 31 , 2024 | 11:53 PM
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో సోమవారం రాత్రి పరిగి మండలం రూఫ్‌ఖాన్‌పేట్ గేట్ సమీపంలో 1100 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు పరిగి ఎక్సైజ్ సీఐ నీరజారెడ్డి తెలిపారు.
పరిగి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో సోమవారం రాత్రి పరిగి మండలం రూఫ్‌ఖాన్‌పేట్ గేట్ సమీపంలో 1100 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు పరిగి ఎక్సైజ్ సీఐ నీరజారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళుతున్న దుద్యాల మండల కేంద్రానికి చెందిన నవీన్‌ను తనిఖీ చేయగా అతడి వద్ద 150 గ్రాముల ఎండు గంజాయి లభించింది. రామాంతాపూర్ నుంచి గంజాయిని తీసుకొస్తున్నట్లు తెలపగా నవీన్‌తో రంగారెడ్డి జిల్లాలోని పటేల్‌నగర్ రామాంతపూర్‌కు తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. అక్కడ నల్గొండకు చెందిన మహేశ్ దగ్గర 950గ్రాముల ఎండు గంజాయి లభించింది. మొత్తం 1100గ్రాముల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇద్దరి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్‌పోర్స్ సీఐలు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు దయాసాగర్, ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సుతారీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 11:53 PM