పెళ్లికి వెళ్లి వస్తుండగా కారును ఢీకొన్న లారీ
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:04 AM
పెళ్లికి వెళ్లివస్తుండగా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయాలపాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కుటుంబంలో ఆరుగురికి గాయాలు
మహిళ పరిస్థితి విషమం
తాండూరు రూరల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి వెళ్లివస్తుండగా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయాలపాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తాండూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, చెల్లెలు అనిత, మరదలు అశ్విని, అత్త బాలమణి, తమ్ముడి కూతుర్లు సమీక్ష, షన్ముఖప్రియతో కలిసి గురువారం జహీరాబాద్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి తాండూరు వస్తున్నారు. అంతారం గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అనిత పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించారు. మిగితావారు తాండూరు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు పోలీసులు తెలిపారు.
Updated Date - Dec 27 , 2024 | 12:04 AM