ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:48 PM
జీవితంపై విరక్తిచెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చెంగోల్‌లో చోటుచేసుకుంది.
తాండూరు రూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జీవితంపై విరక్తిచెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చెంగోల్‌లో చోటుచేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్‌గోముల్ గ్రామానికి చెందిన నర్సగాళ్ల రమేష్(33)కు మిర్యాణ్‌కు చెందిన అనితతో 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. రమేష్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో భార్య, భర్తల మధ్య సంసారం విషయంలో గొడవలు జరిగాయి. ఇదే విషయంలో రమేష్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్లుగా ఆమె పుట్టింట్లోనే ఉండిపోవడంతో రమేష్ కుటుంబీ కులు పంచాయితీ పెట్టి సర్దిచెప్పినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ మద్యానికి అలవాటుపడ్డాడు. తీవ్ర మనస్తాపంలో ఉన్న రమేష్ ఆదివారం సాయంత్రం ఇంట్లో చీరతో ఉరేసుకుని వేలాడుతుండగా తల్లి అనంతమ్మ గమనించింది. వెంటనే అరుపులు, కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి రమేష్‌ను కిందికి దించారు. అక్కడి నుంచి వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.
Updated Date - Dec 22 , 2024 | 11:48 PM