ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, Publish Date - Dec 21 , 2024 | 11:58 PM

అతివేగంతో బైక్‌పై నుంచి కిందపడి ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి.

మూడుచింతలపల్లి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): అతివేగంతో బైక్‌పై నుంచి కిందపడి ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్కపట్లకు చెందిన శీలం దుర్గప్రసాద్‌(27), తన స్నేహితుడు నాగవంశీలు పనినిమిత్తం శనివారం బైక్‌పై వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో కర్కపట్ల-అలియాబాద్‌ మార్గమధ్యలో హెచ్‌బీఎల్‌ బస్టాప్‌ సమీపంలో బైక్‌ ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గప్రసాద్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అతడి స్నేహితుడు నాగవంశీకి తీవ్రగాయ్యాలయ్యాయి. దుర్గాప్రసాద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కారు-బొలెరో ఢీకొని ఇద్దరికి గాయాలు

పరిగి: కారు, బొలెరో వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని చింతలచెరువు వద్ద జరిగింది. హైదరాబాద్‌ నుంచి కొడంగల్‌ వైపు వెళ్తున్న కారు, బొంరా్‌సపేట్‌ నుంచి పరిగికి వస్తున్న బొలెరో వాహనం పరిగి మండలం చింతలచెరువు వద్ద ఢీకొన్నాయి. అయితే బొలెరో వాహనంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వాహనాలు దెబ్బతిన్నాయి.

Updated Date - Dec 21 , 2024 | 11:59 PM