ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బావిలో పడి మహిళ మృతి

ABN, Publish Date - Dec 31 , 2024 | 11:52 PM

దాహార్తిని తీర్చుకునేందుకు వెళ్లిన మహిళ బావిలో కాలు జారిపడి మృతి చెందింది. ఈ ఘటన దోమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది.

దోమ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): దాహార్తిని తీర్చుకునేందుకు వెళ్లిన మహిళ బావిలో కాలు జారిపడి మృతి చెందింది. ఈ ఘటన దోమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పాలెపల్లికి చెందిన మంగలి పద్మమ్మ(37) జీవనోపాధి కోసం తెచ్చుకున్న మేకలను మేత కోసం గ్రామ శివారులోని పంట పొలాల దగ్గరికి తీసుకెళ్లింది. సాయంత్రం వేళలో దాహార్తిని తీర్చుకునేందుకు సమీపంలోని బావి దగ్గరికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు బావిద్దకు వెళ్లి వెతకగా బావి గట్టుపై చెప్పులు, సెల్‌ఫోన్‌ కనిపించాయి. దీంతో బావిలో జారిపడిపోయి ఉంటుందని గ్రహించి స్థానికులు మోటార్ల సాయంతో నీటికి బయటకు తీయగా పద్మమ్మ మృతదేహం కనిపించింది. మృతురాలికి ఓ కూతురు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 11:52 PM