ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెస్టారెంట్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:57 PM

బిర్యానీ తినేందుకు వెళ్లిన తమను రెస్టారెంట్‌ యజమానులు చితకబాదారని, సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత యువకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

రంగారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధిత యువకులు

పూడూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బిర్యానీ తినేందుకు వెళ్లిన తమను రెస్టారెంట్‌ యజమానులు చితకబాదారని, సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత యువకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి చేవెళ్ల మండలం ఘనాపూర్‌ గ్రామానికి చెందిన బాధిత యువకులు ఎం.మహేందర్‌, శంకర్‌, నాగరాజు, సురే్‌షలు ఆదివారం మధ్యాహ్నం పూడూరు మండల పరిధిలోని చిట్టెంపల్లి గేటు సమీపంలో గల నక్షత్ర రెస్టారెంట్‌కు బిర్యాలీ తినేందుకు వెళ్లారు. వారికి తీసుకొచ్చిన బిర్యానీలో డిష్‌లు తోమే స్క్రబ్బర్‌ ఇనుప చువ్వలు రాగా రెస్టారెంట్‌ యజమాని మాణిక్యరావు(మేషక్‌)కు చెప్తే దాడికి పాల్పడినట్లు వాపోయారు. మాణిక్యంతోపాటు సిబ్బంది దాదాపు 15మంది మూకుమ్మడి మాపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంబడించి మరీ తమను గరిటెలు, ఇనుప రాడ్లు, కేబుల్‌ వైర్లు, కర్రలతో తమను చితకబాదారని కలెక్టర్‌ ఎదుట వారికి తగిలిన గాయాలను చూపించారు. నక్షత్ర రెస్టారెంట్‌ నాసిరకమైన భోజనం పెడుతూ కస్టమర్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అలాంటి రెస్టారెంట్‌ను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌, అడిషనల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 11:57 PM