స్నానం చేస్తుండగా ఫొటోలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 11:51 PM
స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి తనను శారీరకంగా వాడుకొని జీవితంతో చెలగాటమాడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్తకు పంపిస్తామని బెదిరింపులు
పలుమార్లు లైంగికదాడి
చర్యలు తీసుకోవాలంటూ వివాహిత ఫిర్యాదు
కులకచర్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి తనను శారీరకంగా వాడుకొని జీవితంతో చెలగాటమాడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరికల్ గ్రామానికి చెందిన వివాహిత మహిళ(38) కొన్ని నెలల కిందట స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన నర్సింహులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. ఈ ఫొటోలు ఇతరులకు, నీ భర్తకు పంపిస్తామని చెప్పి భయపెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు. పలుమార్లు లైంగికదాడి చేశాడని, తాను నర్సింహులుతో కలిసి ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఆనంద్ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి తనభర్తకు, పిల్లలకు పంపించి దూరం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తాను కొన్ని నెలలుగా తన తల్లి ఇంట్లో ఉంటున్నానని తెలిపింది. నర్సింహులు ఇక్కడికీ వచ్చి తనతో కలవాలని భయపెడుతున్నాడని వాపోయింది. తనను శారీరకంగా వాడుకొని జీవితాన్ని నాశనం చేసిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Dec 31 , 2024 | 11:51 PM