ఒక్కేసి పువ్వేసి చందమామ
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:13 AM
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఊరూరా సంబురాలు చేసుకునే రోజు రానే వచ్చింది. బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. యువతులు, ముత్తయిదువులు ఆడుతూ పాడుతూ అలరించే అరుదైన పండుగ బతుకమ్మ. ఇది ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో ఈ పండగ వస్తుంది. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఆడపడుచులు సిద్ధమయ్యారు.
ఒక్కో రోజు ఒక్కో రూపంలో..
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు అటుకుల బతుకమ్మ
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ
ఐదో రోజు అట్ల బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మ
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ
తొమ్మిది రోజులు.. ప్రత్యేక నైవేద్యాలు
పూల పండగకు సిద్ధమైన ఆడపడుచులు
నేటి నుంచి బతుకమ్మ వేడుకలు
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం..
సద్దుల బతుకమ్మతో ముగింపు
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 1 : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఊరూరా సంబురాలు చేసుకునే రోజు రానే వచ్చింది. బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. యువతులు, ముత్తయిదువులు ఆడుతూ పాడుతూ అలరించే అరుదైన పండుగ బతుకమ్మ. ఇది ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో ఈ పండగ వస్తుంది. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఆడపడుచులు సిద్ధమయ్యారు.
ఒక్కో రకం నైవేద్యం
తొమ్మిది రోజుల పాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం
తొమ్మిది రోజుల బతుకమ్మ పండగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో అడపడుచులు అందరూ అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకుంటారు. చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు బతుకమ్మను వాకిట్లో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి మానవహారంగా ఏర్పడి పాటలు పాడతారు. తొమ్మిది రోజుల పాటు వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతీ సాయంత్రం వాకిట్లో పెట్టి కలియతిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడుతారు. తర్వాత దగ్గరలో ఉన్న పుష్కరిణి, చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు.
Updated Date - Oct 02 , 2024 | 11:58 AM