విద్యార్థి అదృశ్యం
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:02 AM
రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు.
మోమిన్‌పేట్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రాంనాథ్‌గూడుపల్లి గ్రామానికి చెందిన కొత్తగడి బాల్‌రాజ్, మంజుల దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి కుమారుడు విష్ణును గురునానక్ యూనివర్సిటీలో చదివిస్తున్నారు. విద్యార్థి విష్ణుకు తల్లిదండ్రులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మూడు రోజులుగా రావడం లేదని కళాశాల యజమాన్యం తెలపడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై శుక్రవారం తల్లిదండ్రులు విద్యార్థి విష్ణు కనిపించడం లేదంటూ ఇబ్రహింపట్నం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - Dec 21 , 2024 | 12:02 AM