ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంతా మా ఇష్టం!

ABN, Publish Date - Dec 22 , 2024 | 11:58 PM

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర, చీర్యాల్‌, యాద్గార్‌పల్లి, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాలు వీలినమయ్యాయి.

కీసరలో అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం

  • ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు

  • నిబంధనలు పాటించకుండా సెల్లార్ల తవ్వకాలు

  • అనుమతి లేకుండా ఫంక్షన్‌హాల్‌, రిసార్ట్స్‌ నిర్మాణం

  • జోరుగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు

  • పట్టించుకోని సంబంధిత అధికారులు

  • పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి

  • దమ్మాయిగూడ బల్దియా పరిధిలో ఇష్టారాజ్యం

కీసర, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర, చీర్యాల్‌, యాద్గార్‌పల్లి, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాలు వీలినమయ్యాయి. ఇందుల్లో మేజర్‌ గ్రామ పంచాయతీలైన కీసర, చీర్యాల్‌ గ్రామాల్లో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇదేమిటని అడిగే నాథుడు లేకపోవడంతో ఆరు అంతస్తులు, మూడు భవనాలు అన్నట్లు సాగుతున్నాయి అక్రమ నిర్మాణాలు. ఆయా గ్రామాలు మున్సిపాలిటీలో వీలినం అయిందే మంచికి అన్నట్లు అక్రమార్కులు, అధికారులు కుమ్మకై విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా..

చీర్యాల్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 78, 81 అనుమతులు లేకుండా రస్టిక్‌ వోగ్‌ పేరిట ఫంక్షన్‌హాల్‌ను నిర్మాణం చేస్తున్నారు. దీనికితోడు అక్కడే సుమారు 15 విశ్రాంతి గదులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన కంటైనర్ల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అక్కడ రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇది అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా కూడా మారింది. లేట్‌ నైట్‌ పార్టీలు, మద్యం ఏరులైపారుతున్నా సంబంధిత అధికారులు ఆ రిసార్ట్‌ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో పడి ఎం జరిగినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీకెండ్‌లో మాత్రం గ్రూపులు, గ్రూపులుగా విభజించి పార్టీలు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించి వేల రూపాయాలు అద్దె వసూళ్లు చేస్తున్నారు. కానీ, ఇందులో ప్రభుత్వానికి మాత్రం ఒక్కపైసా కూడా పన్నులు చెల్లించకపోవడం గమనార్హం.

బిల్‌ కలెక్టర్ల కనుసన్నల్లోనే..

మరో మేజర్‌ గ్రామ పంచాయతీ కీసర. ఇక్కడ పరిస్థితి మరీ దారుణం. వార్డు కార్యాలయంలో మొత్తం బిల్‌ కలెక్టర్ల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. వారు చెప్పిందే అక్కడ వేదం అన్నట్లుగా వార్డు కార్యాలయ అధికారి తన పని తీరు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అదే అసరాగా చేసుకొని కొంత మంది అక్రమార్కులు బిల్‌ కలెక్టర్లను తమ గుప్పిట్లో పెట్టుకొని అక్రమంగా అనుమతులు తీసుకొని ఇష్టానుసారంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారని, ఆయా నిర్మాణాలపై చర్యలు తీసుకోలేమని వార్డు కార్యాలయం అధికారులు నిర్మోహమాటంగా వివరణ ఇస్తుండటం చర్చనీయాంశమైంది. అలాగే చీర్యాల్‌లో సెల్లార్ల విషయంపై స్థానిక అధికారిని వివరణ అడుగ్గా తమకేం సంబంధం లేదని, అంతా మున్సిపల్‌ అధికారులు చూసుకుంటున్నారంటు సమాధానం దాటవేశారు.

సమస్యల పరిష్కారంలో విఫలం

మేడ్చల్‌ కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో జిల్లా ఉన్నత అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో వీలినమైన తర్వాత గ్రామాల్లో పరిపాలన వ్యవస్థ గాడితప్పిందని, సమస్యలు పరిష్కరించడంలో జిల్లా, మున్సిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నోటీసులకే పరిమితం

నియమ, నిబంధనలకు తూట్లు పొడిచి చీర్యాల్‌ గ్రామంలో జోరుగా సెల్లార్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమార్కులు అనుమతులు ఒకలా తీసుకొని, నిర్మాణాలు మరొకలా చేపడుతున్నారు. సెల్లార్‌ తవ్వకాల విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్తె వారు నోటీసులకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నోటీసులు ఇచ్చినా తమకేం పట్టన్నట్లు అక్రమార్కులు నిర్మాణాలను యఽథావిధిగా కొనసాగిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:59 PM