ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరరాజా బ్యాటరీస్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:47 AM

శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

అమర రాజా బిల్డింగ్‌లో ఎగసిపడుతున్న మంటలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘటన

మంటలార్పిన ఫైర్‌ సిబ్బంది.. తప్పిన ప్రాణనష్టం

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న అమర రాజా బ్యాటరీస్‌ కంపెనీ బిల్డింగ్‌ నిర్మాణం జరుగుతోంది. నాలుగో అంతస్తులో వెల్డింగ్‌ మిషన్‌ కిందపడి ఫ్లైవుడ్‌కు మంటలంటుకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పాయి. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. అగ్ని ప్రమాదంపై ఫిర్యాదేమీ రాలేదని ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 12:47 AM