ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: ఓ ఇంట్లో నుంచి పెద్దఎత్తున శబ్ధం.. అపార్ట్‌మెంట్ వాసులు అలర్ట్.. ఏం జరిగిందంటే

ABN, Publish Date - Nov 16 , 2024 | 09:41 AM

Telangana: ఫ్లాట్‌లో భారీ శబ్ధం రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి ఇంట్లోని వారు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఆపై ఫ్లాట్ పూర్తిగా మంటలకు దగ్ధమైపోయింది. అయితే వెంటనే బయటకు వచ్చేయడంతో ఐదు మంది కుటుంబసభ్యులు ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇంట్లో

Fire accident in Rangareddy

రంగారెడ్డి, నవంబర్ 16: జిల్లాలోని పుప్పాల్ గూడలో జరిగిన ఓ ఘటన అందరికీ ఉలిక్కిపడేలా చేసింది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లో నుంచి పెద్దఎత్తున శబ్ధం వచ్చింది. దీంతో అపార్ట్‌మెంట్‌వాసులు అలర్ట్‌ అయ్యారు. ఏం జరిగిందో తెలియక మొదట భయాందోళనకు గురయ్యారు. చివరకు ధైర్యం చేసి అక్కడకు వెళ్లి చూడగా వారు అవక్కాయ్యే ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది... అపార్ట్‌మెంట్‌వాసులు ఎందుకు భయాందోళనకు గురయ్యారో ఇప్పుడు చూద్దాం.

Gold and Silver Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు


జిల్లాలోని పుప్పాల్ గూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోల్డెన్ ఓరియల్ అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తు ప్లాట్ 202 లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కిచెన్‌లోని ఫ్రిజ్ సిలెండర్ ఒక్కసారిగా పేలింది. ఫ్లాట్‌లో భారీ శబ్ధం రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి ఇంట్లోని వారు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఆపై ఫ్లాట్ పూర్తిగా మంటలకు దగ్ధమైపోయింది. అయితే వెంటనే బయటకు వచ్చేయడంతో ఐదు మంది కుటుంబసభ్యులు ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ ఇంట్లో దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

Hyderabad: సర్వేపై ‘పౌర్ణమి’ ఎఫెక్ట్‌.. 30 శాతానికిపైగా ఎన్యూమరేటర్ల గైర్హాజరు


సమాచారం అందిన వెంటనే మూడు ఫైర్ ఇంజిన్‌లు అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్‌ను బిల్డర్ నిర్మించడంతో ఫైర్ ఇంజిన్ పోవడానికి దారి లేక దాదాపు గంట పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా లోపలకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రిజ్‌లో నుంచి మంటలు రావడమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసిన అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు అపార్ట్‌మెంట్ నిర్మాణం చేశారంటూ విరుచుకుపడ్డారు. అయితే ఉన్నట్టుండి అగ్నిప్రమాదం సంభవించడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే అగ్నిప్రమాదంలో ఉన్నదంతా కోల్పోయి బాధితులు కట్టుబట్టలతో నిలబడిన పరిస్థితి అందరినీ కలిచివేసింది.


ఇవి కూడా చదవండి..

YS Jagan: అయినా మారని జగన్.. మళ్లీ అవే అబద్ధాలు..

CM Chandrababu : దోచేసి.. దాచేసారు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2024 | 11:08 AM