రాంగ్‌రూట్‌లో వెళ్లి..
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:12 AM
బైక్‌పై రాంగ్‌రూట్‌లో వెళ్లి బస్సును ఢీకొట్టడంతో బైకర్ మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నందిగామ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని నూజీవీడు పరిశ్రమ సమీపంలోని పాత జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
బస్సును ఢీకొన్న బైకర్
ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
నందిగామ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బైక్‌పై రాంగ్‌రూట్‌లో వెళ్లి బస్సును ఢీకొట్టడంతో బైకర్ మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నందిగామ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని నూజీవీడు పరిశ్రమ సమీపంలోని పాత జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన సోబోదాస్(35) తన మిత్రుడు శంభుదా్‌సతో కలిసి గురువారం ద్విచక్రవాహనంపై అయ్యప్ప ఆలయం నుంచి రాంగ్‌రూట్‌లో వెళుతూ నూజీవీడు పరిశ్రమ సమీపంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దాంతో సోబోదాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. శంభుదా్‌సకు తీవ్ర గాయాలయ్యాయి. శంభుదా్‌సను 108లో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సోబోదాస్ మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న శ్రవణ్‌కుమార్ ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. మృతుడు మహవీర్ స్టీల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
Updated Date - Dec 27 , 2024 | 12:12 AM