పొట్టిగడ్డ తండాలో మేకలు చోరీ
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:49 PM
మండలంలోని పటేల్ చెరువు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పొట్టిగడ్డ తండాలో కాట్రావత్ బాన్యనాయక్‌కు చెందిన ఐదు మేకలు చోరీకి గురయ్యాయి.
కులకచర్ల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పటేల్ చెరువు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని పొట్టిగడ్డ తండాలో కాట్రావత్ బాన్యనాయక్‌కు చెందిన ఐదు మేకలు చోరీకి గురయ్యాయి. నాలుగు రోజుల కిందట గుర్తు తెలియని దుండగులు తన మేకలను ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. మేకల కోసం ఎంత వెతికినా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - Dec 22 , 2024 | 11:49 PM